అమరావతి : చంద్రబాబు ఓటీటీలను ఉపయోగించుకుంటున్నారా ?

Vijaya

చంద్రబాబునాయుడు గురించి జగన్మోహన్ రెడ్డి అండ్ కో తరచూ ఒక మాటంటుంటారు. అదేమిటంటే నిజం చెబితే చంద్రబాబు తల వేయి ముక్కలైపోతుందనే శాపం ఉందని. చూస్తుంటే వాళ్ళు చెప్పేది నిజమేనా అనే డౌట్ పెరిగిపోతోంది. ఎందుకింత డౌటనుమానమంటే ఒక ఓటీటీలో నిజం అనే పేరుతో ఒక టాక్ షో రిలీజవబోతోంది. దీనికి సంబంధించిన ప్రోమోలు సర్క్యులేషన్లో ఉంది. అందులో చంద్రబాబు చెప్పింది చూసిన తర్వాత మరీ ఇన్ని అబద్ధాలు చెప్పారా చంద్రబాబు అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.ఇంతకీ ఆ ప్రోమోలో ఏముందంటే టీడీపీ ఓటమిపైన టాక్ షో ప్రజెంటర్ స్మిత ఒక ప్రశ్న అడిగింది. దానికి చంద్రబాబు సమాధానమిస్తు 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత రాష్ట్రాన్ని బాగుచేయాలనే అబ్సెషన్ వచ్చినపుడు పాలిటిక్స్ ను పూర్తిగా మరచిపోయినట్లు చెప్పారు.  అంటే రాజకీయాన్ని వదిలేసి రాష్ట్రాభివృద్ధిపైనే పూర్తిగా దృష్టిపెట్టిన కారణంగానే 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిందన్న అర్ధం వచ్చేట్లు చెప్పారు.ప్రోమోలో చంద్రబాబు చెప్పింది ఇది మాత్రమే అర్ధమవుతోంది. పూర్తి టాక్ షో చూస్తే కానీ ఏముందో తెలీదు. ఇక్కడే ఒక జగన్ అండ్ కో చెప్పేమాట గుర్తుకొస్తుంది. ఎందుకంటే చంద్రబాబు చెప్పినట్లు డెవలప్మెంట్ మీదేమీ దృష్టిపెట్టలేదు.  ఐదేళ్ళ కాలంలో రాష్ట్రంలో జరిగిన డెవలప్మెంట్ అంటు పెద్దగా ఏమీలేదు. అలాగే రాజకీయాన్ని పూర్తిగా వదిలేసినట్లు చెప్పటం కూడా అబద్ధమే. ఎందుకంటే జగన్ను రాజకీయంగా లేకుండా చేయాలని చంద్రబాబు చేయని ప్రయత్నంలేదు.
వైసీపీ తరపున గెలిచిన 23 మంది ఎంఎల్ఏలు, ముగ్గురు ఎంపీలను ప్రలోభపెట్టి లాగేసుకోవటం రాజకీయమా లేకపోతే అభివృద్ధా ? గెలిచిన కొత్తల్లోనే కేసీయార్ ప్రభుత్వాన్ని దెబ్బకొట్టేందుకు స్టీఫెన్ సన్ అనే నామినేటెడ్ ఎంఎల్ఏ ఓటును కొనేందుకు రు. 5 కోట్లకు బేరమాడటం కూడా చంద్రబాబు దృష్టిలో అభివృద్ధేనా. అదే కదా తర్వాత ఓటుకునోటు కేసుగా దేశంలో సంచలనమైంది. దాని దెబ్బకే కదా హైదరాబాద్ ను అర్ధాంతరంగా వదిలేసి విజయవాడుకు పారిపోయింది. ప్రోమోలోనే ఇన్ని అబద్ధాలుంటే ఇక పూర్తి షో చూస్తే జనాలకు మతిపోతుందేమో.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: