రాయలసీమ : లోకేష్ ను నెటిజన్లు ఆడుకుంటున్నారుగా ?

Vijayaఏ ముహూర్తంలో లోకేష్ పాదయాత్ర యువగళాన్ని మొదలుపెట్టారో కానీ నెటిజన్లకు మంచి సబ్జెక్టయిపోయారు. పాదయాత్ర మొదలైన దగ్గర నుండి నెటిజన్లు ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియా ఓ ఆటాడుకుంటోంది.  గడచిన రెండురోజుల నుండి పాదయాత్రను నిలిపేసేందుకు లోకేష్ ఏదో ఒక సాకును వెతుక్కుంటున్నారు అన్నట్లుగా ప్రచారం బాగా పెరిగిపోతోంది. అసలు లోకేష్ పాదయాత్ర ఎందుకింత జోక్ గా తయారైంది ?
ఎందుకంటే చినబాబుకు విషయ పరిజ్ఞానం లేదు. నాలుక మందం. తనలో ఎన్ని లోపాలున్నా వాటన్నింటిని ప్రత్యర్ధుల ఖాతాలో వేసేయటం తండ్రి నుండి అబ్బిన విద్య. రాష్ట్రంలో ఎక్కడేచిన్న ఘటన జరిగినా వెంటనే దాన్ని జగన్మోహన్ రెడ్డికి ముడిపెట్టేసి ట్విట్టర్లో బురదచల్లేయటం బాగా అలవాటు చేసుకున్నారు. జనాల్లోకి వెళ్ళినపుడు వాగ్ధాటిని మెరుగుపరుచుకునే విషయం మీద దృష్టిపెట్టకుండా తప్పులు మాట్లాడుతున్నారు. నాలుగు మాటలు మాట్లాడితే అందులో పది తప్పులుంటున్నాయి.పాలనను పానల అని, విత్తనాన్ని ఇత్తనం అని, శాశ్వతం అనే పదాన్ని శాశ్వతత్తమని పలుకుతున్నారు. చాలామంది ప్రతిరోజు వాడుక భాషలో ఉపయోగించే పదాలను కూడా లోకేష్ పలకలేకపోవటమే అసలైన లోపం. పైగా పాదయాత్రలో లోకేష్ మాట్లాడుతున్నది వింటుంటే మాట చాలా ముద్దగా వినిపిస్తోంది. దీనివల్లే నారావారి వారసుడు ఏమి మాట్లాడుతున్నాడో కూడా జనాల్లో చాలామందికి స్పష్టంగా అర్ధంకావటంలేదు.జగన్ను ఉద్దేశించి ప్రత్యేకహోదా ఎప్పుడు తెస్తావు ? విశాఖ రైల్వేజోన్ ఎప్పుడొస్తుంది ? పోలవరం ప్రాజెక్టును ఎప్పుడు పూర్తిచేస్తావంటు నిలదీయటమే విచిత్రంగా ఉంది. హోదా, రైల్వేజోన్ అంశాన్ని నాశనంచేసిందే చంద్రబాబు. కేంద్రమే నిర్మించాల్సిన జాతీయ ప్రాజెక్టు పోలవరాన్ని బలవంతంగా గుంజుకున్నది చంద్రబాబే. కమీషన్ల కక్కుర్తి కోసమే పోలవరాన్ని చంద్రబాబు తన చేతుల్లోకి తీసుకున్నారనే వైసీపీ ఆరోపణలు నిజమనిపిస్తోంది. రాష్ట్రం ఇపుడెదుర్కొంటున్న చాలా సమస్యలకు కారణం తన తండ్రే అన్న విషయాన్ని లోకేష్ మరచిపోవటమే ఆశ్చర్యంగా ఉంది.  హామీలివ్వలేక, ప్రభుత్వంపై చేసే ఆరోపణలు, విమర్శల్లో పసలేకపోవటంతో ఏమి మాట్లాడాలో అర్ధంకావటంలేదట. అందుకనే పాదయాత్రను కంటిన్యు చేయలేక ఆపేయటానికి సాకు ఏమి దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నారనే సెటైర్ భలే పేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: