"ఆదాల ప్రభాకర్ రెడ్డి VS కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి" పొలిటికల్ గేమ్ స్టార్ట్ !

VAMSI
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలు అందరూ ఇప్పుడు నెల్లూర్ రాజకీయాలలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీసుకున్న షాకింగ్ నిర్ణయం పట్ల విభిన్న రీతిలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు కోటంరెడ్డి తీసుకుంది సరైన నిర్ణయం అంటూ సమర్ధిస్తుంటే మరికొందరు ఇలా చేసి ఉండాల్సింది కాదు అంటూ విమర్శిస్తున్నారు. అయితే ఇది ఎంతవరకు కోటంరెడ్డి రాజకీయ భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది అన్నది రానున్న రోజుల్లో తెలియనుంది. ప్రస్తుతం కోటంరెడ్డి ముందున్న ప్రధాన కర్తవ్యం ఏంటంటే తాను ఏ పార్టీలో ఉన్నా తనను నమ్మి వచ్చే వారు ఎవరో గుర్తించి ఒక టీమ్ ను ఏర్పాటు చేసుకోవాలి. 

ఎందుకంటే ఇప్పటికే నెల్లూర్ రూరల్ నియోజకవర్గానికి ఇంఛార్జి గా నెల్లూర్ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని జగన్ నియమించిన సంగతి తెలిసిందే. ఇక ప్రతిక్షణం రూరల్ లో ప్రభాకర్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">ఆదాల ప్రభాకర్ రెడ్డి vs కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పోటీ పడాల్సిన సమయం వచ్చేసింది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో పోల్చుకుంటే ఆదాల ప్రభాకర్ రెడ్డికి రూరల్ లో మద్దతు ఎక్కువగా ఉందన్న కారణంగానే జగన్ ఆయనకు పగ్గాలు ఇచ్చినట్లు సమాచారం. ఇందుకు చక్కని ఉదాహరణే... పార్టీ మారుతున్నట్లు ప్రకటించిన అనంతరం కార్పొరేటర్ లు కార్యకర్తలు కోటంరెడ్డి వైపే ఉంటామన్నారు. కానీ ఎప్పుడైతే ఆదాల ప్రభాకర్ రెడ్డిని రూరల్ ఇంఛార్జి గా నియమించారో , వెంటనే పరిణామాలు మారిపోయాయి..

కోటంరెడ్డి తోనే ఉంటామన్న కార్యకర్తలు మరియు కార్పొరేటర్ లు మేము వైసీపీలోనే ఉంటాము అంటూ తెగేసి చెప్పారట. అలా ఇప్పుడు నెల్లూర్ లో ఉన్న మొత్తం 26 మంది కార్పొరేటర్ లలో సగానికి పైగా అంటే 16 మంది కార్పొరేటర్ లు వైసీపీ వైపు ఉన్నారు. రోజులు గడిచే కొద్దీ మిగిలిన వారు కూడా వైసీపీ పంచన చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీనితో అసలైన పొలిటికల్ గేమ్ ఇప్పుడు వీరిరువురి మధ్యన స్టార్ట్ అయింది. మరి ఎవరు తుదకు గెలుస్తారో తెలియాలంటే ఎన్నికల వరకు ఆగాల్సిందే. అప్పటి వరకు ఆదాల మరియు కోటంరెడ్డి మధ్యన రాజకీయ వ్యూహాలు ఎత్తులు పై ఎత్తులు చూడాల్సిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: