సుమలో ఈ యాంగిల్ కూడా ఉందని తెలిస్తే షాక్ అవుతారు..!?

Anilkumar
ప్రస్తుతం టాప్ యాంకర్ల లిస్ట్ చూస్తే ఫస్ట్ ఉండే పేరు యాంకర్ సుమ. ప్రస్తుతం సుమ ఇటు షోలో మరియు స్టార్ హీరోల సినిమాల ఫ్రీ రిలీజ్ ఈవెంట్లు సైతం చేస్తూ బిజీ బిజీగా ఉంది. ఒకవేళ సుమ డేట్స్ ఖాళీగా లేకపోతే స్టార్ హీరోలు సైతం తమ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను వాయిదా వేసుకుంటున్నారు. సుమ నాలుగు నుండి ఐదు భాషల వరకు అనర్గళంగా మాట్లాడుతుంది. మొదట సీరియల్ నటిగా తన కెరియర్ ని ప్రారంభించిన ఈమె తన ప్రతిభతో యాంకర్ గా కొనసాగింది. అనంతరం ఇప్పుడు స్టార్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది.దాదాపు 15 ఏళ్ల నుండి ఈటీవీ షో లో స్టార్ మహిళ కి యాంకర్ గా వ్యవహరిస్తూ రికార్డ్ సృష్టించింది సుమ. 

స్టార్ మహిళ షో తో పాటు పట్టుకుంటే పట్టు చీర భలే చాన్సులే వంటి అనేక లేడీ షో లను ఏకంగా సంవత్సరాలు తరబడి నడిపించింది సుమ.వీటితోపాటు పాడుతా తీయగా స్వరాభిషేకం వంటి ప్రముఖ షోకి యాంకర్ గా వ్యవహరించడం జరిగింది. అంతేకాదు పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటించిన సుమ ఇటీవల జయమ్మ పంచాయతీ సినిమాలో కథానాయకగా కూడా నటించడం జరిగింది.ప్రస్తుతం సుమకి 47 సంవత్సరాలు. ఇటీవల యాంకరింగ్ కు రిటైర్మెంట్ తీసుకోవాలని సుమ ఆలోచిస్తున్నట్లుగా కూడా రకరకాల వార్తలు వచ్చాయి.సుమ గత 20 ఏళ్ళు గా నాన్ స్టాప్ గా యాంకర్ గా పనిచేస్తుంది. నిత్యం మాట్లాడుతూనే ఉంటుంది.

ఈ నేపథ్యంలోనే తన గొంతుకి సంబంధించిన కూడా చేయించుకుంది సుమ. ఈ నేపథ్యంలోనే యాంకరింగ్ కు కాస్త విరామం తీసుకోవాలని భావిస్తుందట. ఇక అసలు విషయం ఏంటంటే సుమ ఒక గొప్ప సామాజిక కర్త. నిస్సహాయంగా ఉన్న వారికి నీ ఆదుకునే  మనసు ఆమెది. ఇంతకుముందే సుమా దాదాపు 30 మందికి పైగా విద్యార్థులను దత్తత తీసుకొని వారి పూర్తి బాధ్యతలను తానే స్వీకరించింది. ఈ విషయాన్ని తాజాగా చెన్నై కాలేజీలో జరిగిన ఒక కార్యక్రమంలో వెల్లడించింది. ఈ క్రమంలోనే సామాజిక సేవలో భాగంగా సుమ ఫెస్టివల్ ఫర్ జాయ్ అనే సంస్థను కూడా ప్రారంభించినట్లుగా తెలిపింది. ఇందులో భాగంగానే 30 మంది విద్యార్థులను దత్తత తీసుకొని వారి చదువు బాధ్యతలను స్వీకరించినట్లుగా తెలిపింది. జీవితంలో స్థిరపడే వరకు వారి బాధ్యత అంతా తనదే అని చెప్పుకొచ్చింది. ఇది తెలిసిన చాలా మంది నెటిజెన్లు సుమపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: