రాయలసీమ చంద్రబాబు మీద యాక్షన్ తీసుకునే దమ్ముందా ?

Vijayaఇపుడిదే ప్రశ్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఎదురవుతోంది. రోడ్లపై సభలు, ర్యాలీలు, రోడ్డుషోలను ప్రభుత్వం నిషేధించిన విషయం అందరికీ తెలిసిందే. దాన్ని చాలెంజ్ చేస్తు చంద్రబాబునాయుడు మూడురోజుల కుప్పం పర్యటన పెట్టుకున్నారు. బుధవారమే శాంతిపురం మండలంలో పెద్దూరులో పోలీసులతో పెద్దఎత్తున వాగ్వాదం జరిగింది. కావాలనే పోలీసులను రెచ్చగొట్టి గొడవపెట్టుకున్నారు. పోలీసుల ముందే జనాలను ఉద్దేశించి మైకులో మాట్లాడారు. 
ఇక రెండోరోజు కుప్పం గెస్ట్ హౌస్ నుండి బయలుదేరి బస్టాండ్ వరకు భారీ ర్యాలీ చేశారు. మరి ప్రభుత్వం వేటినైతే నిషేధించిందో వాటినే పోలీసుల సమక్షంలోనే చంద్రబాబు చేసి చూపించారు. పోలీసులు వద్దన్నా వినకుండా వాళ్ళముందే మైకులో మాట్లాడినందుకు, ప్రభుత్వం నిషేధించిన ర్యాలీని తీసినందుకు ఇపుడు పోలీసులు చంద్రబాబుపై కేసులు పెట్టగలరా ? కేసులు పెట్టి యాక్షన్ తీసుకునేంత ధైర్యం జగన్ ప్రభుత్వానికి ఉందా ?ఇప్పటికే ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధంగా టీడీపీ నేతలు, శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేశారు. చంద్రబాబుకు  పవన్ కల్యాణ్, సీపీఐ రామకృష్ణ మద్దతుతెలిపారు. పోలీసుల మీద తిరగబడ్డారని కొందరు నేతలపై పోలీసులు ఇప్పటికే కేసులు పెట్టారు. ఇపుడు చంద్రబాబు చేసింది కూడా ఇదేకదా. మరి చంద్రబాబు విషయంలో ప్రభుత్వం ఏమిచేయబోతోంది అనేది ఆసక్తిగా మారింది. ప్రభుత్వ ఉత్తర్వులను తనకు అనుకూలంగా చంద్రబాబు మలుచుకున్నారు.శాంతిపురం మండలంలో కానీ గురువారం కుప్పంలో కానీ చంద్రబాబు కొంతమందిని ఇంటింటికి వెళ్ళి కలిశారు.
అలాగే తాను తిరిగే ప్రతిచోట ఇదే విధంగా ఇంటింటికి తిరిగి జనాలను కలిసే అవకాశముంది. నిజానికి ప్రభుత్వం ఉత్తర్వులను జారీచేసిన కారణం చంద్రబాబే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నాలుగురోజుల వ్యవధిలో చంద్రబాబు పాల్గొన్న రెండు సభల్లో తొక్కిసలాట కారణంగా 11 మంది చనిపోయారు. నిర్వాహకుల వైఫల్యం కారణంగానే ఇంతమంది చనిపోయారు. అయితే ఆ విషయాన్ని చంద్రబాబు అండ్ కో అంగీకరించకుండా ప్రభుత్వంపై ఎదురుదాడులు చేశారు. అందుకనే ర్యాలీలు, రోడ్డుషోలు, రోడ్డు సభలను ప్రభుత్వం నిషేధించింది. మరి చంద్రబాబు అన్నింటినీ ఉల్లంఘించిన నేపధ్యంలో ఏమి  యాక్షన్ తీసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: