అమరావతి : ప్రభుత్వంపై టీడీపీ ఎదురుదాడి..ఊహించిందేనా ?

Vijaya



అనుమానిస్తున్నట్లుగానే తెలుగుదేశంపార్టీ నేతలు ఎదురుదాడులు మొదలుపెట్టారు. నెల్లూరు జిల్లా కందుకూరులో బుధవారం చంద్రబాబునాయుడు బహిరంగసభ సందర్భంగా జరిగిన ప్రమాదంలో 8 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన తీరుతో చంద్రబాబుతో పాటు తమ్ముళ్ళ మైండ్ బ్లాంక్ అయిపోయింది. ప్రమాదంలో 8 మంది చనిపోవటం అంటే చిన్న విషయంకాదు. అందుకనే బుధవారం రాత్రి ప్రమాదం జరిగితే గురువారం ఉదయం వరకు చంద్రబాబుతో పాటు తమ్ముళ్ళెవరు మీడియాకు అందుబాటులోకి రాలేదు.



మధ్యాహ్నానికి తేరుకుని బాగా ప్రిపేర్ అయి ప్రభుత్వం మీద ఎదురుదాడికి దిగారు. చంద్రబాబు బహిరంగసభ జరుగుతుందని తెలిసీ పోలీసులతో తగిన బందోబస్తు ఏర్పాటుచేయకపోవటం ప్రభుత్వం తప్పేనంటు బోండాఉమ, వర్లరామయ్య, reddy SOMIREDDY' target='_blank' title='సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రెచ్చిపోయారు. అవసరమైన బందోబస్తు ఏర్పాటుచేయటంలో పోలీసులు ఫెయిలయ్యారంటు మండిపోయారు. ఆరోపణలనుండి బయటపడేందుకు చంద్రబాబు, తమ్ముళ్ళు ఇలాంటి ఎదురుదాడి మొదలుపెడతారని అందరు అనుకుంటున్నదే. గతంలో వైఎస్సార్, జగన్, విజయమ్మ కూడా కందుకూరులో ఇక్కడే మీటింగులు పెట్టారట.



ఇరుగ్గా ఉండే ఎన్టీయార్ సర్కిల్లో ఎంతమంది మీటింగులు పెట్టారన్నది కాదు ఇక్కడ ప్రశ్న. ఇపుడు చంద్రబాబునాయుడు ఇంత ఇరుగ్గా ఉండే రోడ్డుపైన ఎలాంటి ముందుజాగ్రత్తలు తీసుకోకుండా బహిరంగసభ పెట్టడం ఏమిటనేది పాయింట్. చంద్రబాబు మీటింగులో ప్రమాదం జరిగింది కాబట్టే అందరు చంద్రబాబును తప్పుపడుతున్నారు. ఇదే ప్రమాదం జగన్మోహన్ రెడ్డి మీటింగులో జరిగితే అప్పుడు జగన్ను కూడా అందరు తప్పుపట్టుండేవాళ్ళే .




గతంలో ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీకేజీ ప్రమాదం జరిగినపుడు చంద్రబాబు+తమ్ముళ్ళు ఏ విధంగా స్పందించారు ? అప్పట్లో ప్రమాదానికి ప్రభుత్వానికి అసలు సంబంధమే లేదు. ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్వహణ తప్పిందంవల్లే ప్రమాదం జరిగింది. అయితే చంద్రబాబు అండ్ కో మాత్రం జగన్నే తప్పుపట్టారు. అప్పటి మరణాలన్నింటినీ ప్రభుత్వ  హత్యలే అంటు ఎంత గోలగోల చేశారు. పైగా ఇప్పటి ప్రమాదాన్ని రాజకీయం చేయకుండా మానవత్వం ప్రదర్శించాలంటు నీతులు మాట్లాడుతున్నారు. మరిలాంటి ప్రమాదాలు ఎప్పుడు జరిగినా టీడీపీ మానవత్వంతోనే వ్యవహరిస్తుందా ? రాజకీయం చేయకుండానే  ఉంటుందా ? తన విషయంలో ఒకలాగ ప్రత్యర్ధుల విషయంలో మరోలాగ వ్యవహరించటం చంద్రబాబుకు బాగా అలవాటే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: