గ్యాస్ వినియోగదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్..భారీ తగ్గింపు..

Satvika
ఈ మధ్య కాలం ప్రతి ఒక్కరూ వంట గ్యాస్ ను వాడుతున్నారు.. అయితే అందరికి మంచి జరగాలని ఎన్నో పథకాలను అందిస్తూ వస్తున్నారు.. అందులో భాగంగా కేంద్రప్రభుత్వం 2016లో ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది... ఈ పథకం ద్వారా ఎంతో మంది లబ్ది పొందారు.. ఈ పథకం కింద గ్యాస్ కనెక్షన్లకు కేంద్రప్రభుత్వం పంపిణీ చేసింది. ఈ పథకం లో వినియోగదారుల కు గ్యాస్ సిలిండర్ల పై కేంద్రప్రభుత్వం రాయితీని అందిస్తోంది.

మీరు ఉజ్వల పథకం లబ్ధిదారు అయితే, ఎల్పీజీ పై రాయితీ ని పొందవచ్చు. వచ్చే ఏడాదికి గాను కేంద్ర బడ్జెట్లో ఉజ్వల పథకం లబ్ధిదారుల కు వంట గ్యాస్ సిలిండర్పై ఏడాది లో 12 సిలిండర్ల కు ఒక్కోదాని కి రూ. 200 తగ్గింపును ఏడాది పాటు పొడిగించే అవకాశం ఉంది. ఉజ్వల యోజన పథకం లో గ్యాస్ సిలిండర్పై రాయితీని మార్చి 2023 తర్వాత కూడా పొడిగించే చాన్స్ వున్నట్లు తెలుస్తోంది. పేద కుటుంబం లోని ఉన్న కుటుంబాల లో ని మహిళలకు కొత్త ఎల్పీజీ కనెక్షన్ల కోసం రూ.1,600ల ఆర్థిక సహాయం అందించడం, అలాగే వినియోగాన్ని ప్రోత్సహించడం ప్రధాన లక్ష్యంగా ఉజ్వల యోజనను కేంద్రప్రభుత్వం అందుబాటులోకి తీసుకోని వచ్చింది...

ఇక్కడే కాదు అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ పథకం ద్వారా వారికి కూడా లబ్ది చేకూరుతుందని ఆశాభావం  వ్యక్తం చేస్తున్నారు.. ప్రభుత్వం రూ.500 లకే 12 సిలిండర్ల ను అందజేస్తుందని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఇప్పటికే  కొనసాగించనుంది. అలాగే గుజరాత్‌ లోని బిజెపి ప్రభుత్వం ఈ ఏడాది అక్టోబర్‌ లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఉజ్వల పథకం లబ్ధిదారుల కు ప్రతి సంవత్సరం రెండు ఉచిత ఎల్‌పిజి సిలిండర్ల ను పంపిణీ చేస్తామని ప్రకటించింది... మొత్తానికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: