చైనాను వణికిస్తున్న కరోనా.. ఒక్క రోజులో ఎన్ని కేసులంటే?

Satvika
కరోనా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..రెండు, మూడేళ్ళు పాటు జనాలను అనేక ఇబ్బందులకు గురి చేసింది..ఎంతో మంది ప్రాణాలను కోల్పోయారు.. ఇక పాజిటివ్ కేసులు కూడా ఇప్పటికీ పెరుగుతూ వస్తున్నాయి.. ఒక వైపు ప్రభుత్వం వ్యాక్సిన్ పంపిణి చేస్తున్నా కూడా మరోవైపు పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతూ వస్తున్నాయి.. వ్యాక్సిన్ తీసుకున్నారన్నా ధీమా తో కరోనా జాగ్రత్తలు పాటించడం మానేశారు. దాంతో కేసులు కూడా భారీగా పెరుగుతూ వస్తున్నాయి. కేసులను తగ్గించడానికి పలు రకాల చర్యలను తీసుకుంటూ వస్తున్నా ఆందోళన కలిగిస్తున్నాయని తెలుస్తుంది..

ఇక ఆసుపత్రిలో పడకలు లేక బేంచీలు, బల్లల మీదే చికిత్స అందిస్తున్నారు. శవాలను పూడ్చేందుకు శ్మశాన వాటికల్లో స్థలం లేక వేరే ప్రదేశాలకు తరలిస్తున్నారని అక్కడి అధికారులు చెబుతున్నారు.. ఈ పరిస్థితి ఇలా ఉంటే చైనా ఆరోగ్య శాఖ ఆదివారం అనూహ్య ప్రకటన చేసింది. ఇకపై కరోనా కేసుల వివరాలు తాము వెల్లడించమని తెలిపింది. అదే విధంగా. అంటువ్యాధుల నియంత్రణ, పరిశోధన కేంద్రమే కరోనా వివరాలను చూసుకుంటుందని చెప్పింది. అయితే కేసుల లెక్కలు ఎప్పుడు వెల్లడిస్తారు అనే విషయాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. దీంతో కరోనా లెక్కలు దాచేందుకు చైనా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం అవుతుంది..

రేడియో ఫ్రీ ఆసియా లీక్ చేసిన ప్రభుత్వ డాక్యుమెంట్ ప్రకారం చైనాలో 20 రోజుల వ్యవధిలోనే 25 కోట్ల మంది వైరస్ బారినపడినట్లు తెలుస్తోంది. ఈ సంఖ్య చైనా జనాభాలో 17.65 శాతం కావడం గమనార్హం.. మరో మూడు నెలల్లో చైనాలో కరోనా కారణంగా 20 లక్షల మంది చనిపోతారని నిపుణులు అంచనా వేస్తున్నారు..అంటే తీవ్ర ఏ స్థాయిలొ వుందో అర్థం చేసుకోవచ్చు.. ఇక లాక్ డౌన్ దిశగా చైనా అడుగులు వేస్తుంది.. ఇక పోతే మిగిలిన దేశాలల్లో కూడా కరోనా తీవ్రత పెరుగుతుంది..ఈసారి ఎంత మంది చనిపొతారో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: