అమరావతి : టీడీపీ అభ్యర్ధి పైన ఫిర్యాదులా ?

Vijaya


ఈ అనుమానం మామూలు జనాలకు కాదు పార్టీ నేతలకే వచ్చింది. అందుకని ఇదే విషయాన్ని ఈమధ్య కలిసినపుడు పార్టీ అధినేత చంద్రబాబునాయుడును ఫిర్యాదు రూపంలో డైరెక్టుగా అడిగారట. వాళ్ళ ప్రశ్నతో చంద్రబాబు కూడా ఒక్కసారిగా షాక్ తిన్నట్లు సమాచారం. ఇంతకీ విషయం ఏమిటంటే రాష్ట్ర రాజకీయాల్లో  కడప జిల్లాలోని పులివెందులకు ఒక విశిష్టమైన స్ధానముంది. ఇంతకీ ఆ విశేషం ఏమిటంటే గడచిన 13 ఎన్నికల్లో అంటే 1978 నుండి 2019 వరకు ఇక్కడ వైఎస్ కుటుంబానికి ఓటమన్నదే లేదు.



పులివెందులలో వైఎస్ కుటుంబం నుండి ఎవరు పోటీచేసినా నామినేషన్ వేస్తేచాలు గెలుపే. వైఎస్ కుటుంబాన్ని ఓడించాలని టీడీపీ ఎంత ప్రయత్నించినా సాధ్యంకాలేదు. ఇలాంటి నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తామని చంద్రబాబు పులివెందుల పర్యటనలో బహిరంగంగా చాలెంజ్ చేశారు. మరి చాలెంజ్ చేసిన తర్వాత నియోజకవర్గంలో పార్టీ నేతలు ఎలాగుండాలి ? ఎలాగున్నారంటే చంద్రబాబు చాలెంజితో తమకేమీ సంబంధం లేదన్నట్లుగా ఉన్నారు.



వైఎస్ కుటుంబంమీద ఐదుసార్లు పోటీచేసిన సతీష్ కుమార్ రెడ్డి టీడీపీలో ఇపుడు యాక్టివ్ గా లేరు. అందుకనే బీటెక్ రవికి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. అప్పగించటమే కాకుండా అభ్యర్ధిగా చంద్రబాబు ప్రకటించేశారు కూడా. అభ్యర్ధిగా చంద్రబాబు అయితే ప్రకటించారు కానీ బీటెక్ రవి మాత్రం నియోజకవర్గంలో యాక్టివ్ గా లేరట. నియోజకవర్గంలో నేతలతో అసలు సమావేశాలే పెట్టడంలేదట.




బాదుడేబాదుడు కార్యక్రమంకానీ ఇదేంఖర్మ...రాష్ట్రానికి కార్యక్రమం కానీ నియోజకవర్గంలో జరగటమే లేదట. పార్టీకి సంబందించిన ఎలాంటి కార్యక్రమం బీటెక్ రవి చేయటంలేదట. ఇదే విషయాన్ని కొందరు నేతలు చంద్రబాబు దగ్గర ఫిర్యాదు చేశారట. దాంతో చంద్రబాబుకు షాక్ కొట్టినట్లయ్యిందట. రవి వైఖరితో అసలు నియోజకవర్గంలో టీడీపీకి అభ్యర్ధి ఉన్నారా అన్నదే అనుమానంగా ఉందట. పులివెందులలో జగన్ను ఓడించాలని అధినేత ప్రతిజ్ఞ చేసిన తర్వాత కూడా రవి ఎందుకు యాక్టివ్ గా లేరో అర్ధంకావటంలేదట. మరి ఇలాఅయితే జగన్ను ఓడించటం ఎలాగ అనేది చంద్రబాబుకు అర్ధంకావటంలేదు. 






మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: