బీటెక్ విద్యార్థులకు గుడ్ న్యూస్..ఎస్‌బీఐ లో ఉద్యోగాలు..

Satvika
ప్రముఖ ప్రభుత్వ బ్యాంకు స్టేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ముంబైలోని ఎస్‌బీఐ కార్పొరేట్ సెంటర్‌ పలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది.నోటిఫికేషన్‌లో భాగంగా రెగ్యులర్/ ఒప్పంద ప్రాతిపదికన డిప్యూటీ మేనేజర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల నియామకానికి దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి..ఎలా దరఖాస్తు చేసుకోవాలి..మొదలగు పూర్తి వివరాలు మీకోసం..


ఖాళీలు, అర్హతలు..


నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 36 ఖాళీలను భర్తీ చేయనున్నారు.


* వీటిలో డిప్యూటీ మేనేజర్(డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్) (06), డిప్యూటీ మేనేజర్(ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంజినీర్) (02), డిప్యూటీ మేనేజర్(జావా డెవలపర్) (05), డిప్యూటీ మేనేజర్(డబ్ల్యూఏఎస్‌ అడ్మినిస్ట్రేటర్) (03), సీనియర్ ఎగ్జిక్యూటివ్(ఫ్రంటెండ్ యాంగ్యులర్ డెవలపర్) (03), సీనియర్ ఎగ్జిక్యూటివ్(పీఎల్‌ & ఎస్‌క్యూఎల్‌ డెవలపర్) (03), సీనియర్ ఎగ్జిక్యూటివ్(జావా డెవలపర్) (10 ), సీనియర్ ఎగ్జిక్యూటివ్(టెక్నికల్ సపోర్ట్) (01), ఎగ్జిక్యూటివ్(టెక్నికల్ సపోర్ట్) (02), సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ (టెక్నాలజీ ఆర్కిటెక్ట్) (01) పోస్టులు ఉన్నాయి.



* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీఈ, బీటెక్‌(కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్) లేదా ఎంసీఏ/ ఎంఈ, ఎంటెక్‌/ ఎంఎస్సీ (కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఎలక్ట్రానిక్ & కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్ ) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీంతో పాటు సంబంధిత విభాగంలో అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
* అభ్యర్థుల వయసు 31-07-2022 నాటికి ఎగ్జిక్యూటివ్ పోస్టులకు 32 ఏళ్లు, మిగిలిన పోస్టులకు 35 సంవత్సరాలు మించకూడదు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.


* డీఎం పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారిని ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా, మిగిలిన పోస్టులకు షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ, సీటీసీ నెగోషియేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఎంపికైన అభ్యర్థులు నవీ ముంబైలో పని చేయాల్సి ఉంటుంది.
* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా 29-12-2022ని నిర్ణయించారు..మరింత సమాచారం కోసం బ్యాంక్ అధికారిక వెబ్ సైట్ లో పూర్తీ వివరాలను తెలుసుకోవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: