గోదావరి : చంద్రబాబు ఫాలోవర్ గా మారిపోయారా ?

Vijaya

ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబునాయుడు కూడా చివరకు వైఎస్ షర్మిలకు ఫాలోవర్ గా మారిపోయినట్లున్నారు. చంద్రబాబు ఎప్పుడు మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా తన గురించి గొప్పలు చెప్పుకోవటానికి సరిపోతుండేది. తాను అప్పుడు అంతచేశానని, తాను లేకపోతే అసలు లోకమే లేదన్నట్లుగా మాట్లాడుతుంటారు. కానీ ఈమధ్య కాస్త రూటు మార్చినట్లే అనిపిస్తోంది. ఆ రూటుకూడా షర్మిల రూట్లో వెళుతున్నట్లుగా అనుమానం వస్తోంది.ఇంతకీ విషయం ఏమిటంటే కర్నూలు, విజయనగరం, ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటిస్తున్న చంద్రబాబు కాస్త తన గొప్పలు తగ్గించి స్ధానిక సమస్యలపైన ఎక్కువగా దృష్టిపెడుతున్నట్లు అనిపిస్తోంది. ఏనియోజకవర్గంలో పర్యటిస్తుంటే అక్కడి సమస్యలను, అధికారపార్టీ ప్రజాప్రతినిదులను టార్గెట్ చేస్తున్నారు. నిడదవోలు నియోజకవర్గంలోని జనాలకు ఎక్కడో హైదరాబాద్ ను డెవలప్ చేసింది నేనే, హైటెక్ సిటీని కట్టింది నేనే మొబైల్ ఫోన్ను ఇండియాలోకి తెచ్చింది నేనే అంటే ఎవరు పట్టించుకుంటారు.జనాల ఆలోచనలు ఎంతసేపు నిడదవోలులో సమస్యలు వాటి పరిష్కారాల గురించే కదా ఆలోచించేది. అలాగే జగన్మోహన్ రెడ్డి లక్ష కోట్లరూపాయలు తింటే ఏమిటి తినకపోతే ఏమిటి అనేది సమస్యే కాదు. నిడదవోలులో రోడ్లు బాగున్నాయా ? రేషన్ అందుతోందా ? రోజువారి పనులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరుగుతున్నాయా అన్నదే చూస్తారు. ఇక్కడే చంద్రబాబు తెలంగాణాలో షర్మిల మోడల్ ను కాపీ కొడుతున్నారు. పాదయాత్రలో భాగంగా షర్మిల ఏమిచేస్తున్నారంటే కేవలం స్ధానిక సమస్యలను మాత్రమే ప్రస్తావిస్తున్నారు. మంత్రి లేదా లోకల్ ఎంఎల్ఏని టార్గెట్ చేస్తున్నారు. జనాల సమస్యలు పరిష్కారం కాకపోవటానికి మంత్రి లేదా ఎంఎల్ఏనే కారణమని పదేపదే ఆరోపణలు గుప్పిస్తున్నారు. దాంతో జనాలు కూడా కాస్త ఆలోచిస్తారు. ఇపుడు ఏపీలో చంద్రబాబు కూడా షర్మిలనే ఫాలో అయిపోతున్నారు. ఎక్కువభాగం లోకల్ సమస్యలు, వాటి పరిష్కారాలు, సమస్యలకు కారకులను టార్గెట్ చేయటం మొదలుపెట్టారు. మరి చంద్రబాబు కొత్త రూటు జనాలకు ఎక్కుతుందా ? అనేది వెయిట్ చేస్తేకానీ తెలీదు.మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: