పాత 500,1000 నోట్ల రద్దుపై సుప్రీంకోర్టు ఏమందంటే?

Satvika
2016 లో మోడీ ప్రభుత్వం పాత 500,1000 నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే.. వారి దగ్గర ఉన్న బ్యాంకులలో నోట్లను మార్చుకోవాలని ప్రభుత్వం కోరింది.. మీ వద్ద ఇప్పటికీ పాత 500, 1000 రూపాయల నోట్లు ఉండి కొన్ని కారణాల వల్ల వాటిని మార్చుకోలేకపోతే 500, 1000 రూపాయల పాత నోట్లను మార్చుకోవడానికి మీకు ఇంకా అవకాశం ఉంది. నోట్ల రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. నోట్ల రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై శుక్రవారం సుప్రీం కోర్టు విచారణ నిర్వహించింది. పాత కరెన్సీ నోట్లను మార్చుకోవాలనుకునే వ్యక్తులు చేసిన నిజమైన దరఖాస్తులను ఆర్బీఐ పరిగణనలోకి తీసుకోవాలని.. పాత నోట్లను మార్చుకునే గడువు ముగిసినా నోట్ల మార్పిడికి మరో అవకాశం ఇవ్వాలని ఆర్బీఐకి సూచించింది.

ఈ వ్యవహారంపై తదుపరి విచారణ డిసెంబర్ 5కు వాయిదా వేసింది. దేశవ్యాప్తంగా చాలా మందికి తమ ఇంటిని శుభ్రం చేస్తున్నప్పుడు పాత 500, 1000 నోట్లు దొరికాయని చెబుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు ఈ నోట్లను జ్ఞాపికగా ఉంచుకోగా, మరికొంత మంది పనికిరానివిగా భావించి వాటిని పారేసేవారు. నవంబర్ 8న రూ.500, రూ.1000 నోట్ల రద్దు నిర్ణయం చెల్లుబాటుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.ఐదుగురు న్యాయమూర్తులు జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్, బి.ఆర్. గవాయి, ఎ.ఎస్. బోపన్న, వి. రామసుబ్రమణియన్ మరియు బి.వి. రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తూ గతంలో తీసుకున్న నిర్ణయం చెల్లుబాటవుతుందనే విషయమై పరిశీలిస్తున్నారు.


భారత అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి మాట్లాడుతూ నోట్ల రద్దు తేదీలను పొడిగించలేమని, అయితే రిజర్వ్ బ్యాంక్ కొన్ని వ్యక్తిగత కేసులను దరఖాస్తుదారులకు అవసరమైన షరతుల నెరవేర్పుకు లోబడి పరిగణిస్తుంది. ప్రస్తుతం ఆ నోట్ల రద్దు పై సుప్రీంకోర్టు విచారణ జరుపుతుంది. కోటి పైగా పాత నోట్లను తన వద్ద ఉంచుకున్నట్లు ఓ పిటిషనర్ తెలిపారు. దీనిపై న్యాయస్థానం.. ఆ నోట్లను జాగ్రత్తగా ఉంచుకోవాలని సూచించింది. నోట్ల రద్దు సమయంలో తాను విదేశాల్లో ఉన్నానని పిటిషనర్‌ తన పిటిషన్‌లో తెలిపారు.వచ్చే 5 న ఈ విచారణ తిరిగి జరగనుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: