రాయలసీమ : చంద్రబాబు మీద విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోందా ?

Vijaya


ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు, అజ్ఞానవాసి పవన్ కల్యాణ్ ఏమన్నా మాట్లాడారంటే ఒకసెక్షన్ ఆఫ్ నెటిజన్లకు పండగే పండగ. సోషల్ మీడియాలో  వీళ్ళని వ్యతిరేకించే వాళ్ళు వీళ్ళ మాటలను విపరీతంగా ట్రోలింగ్ చేస్తుంటారు. ఇపుడిదంతా ఎందుకంటే కర్నూలు జిల్లా పర్యటనలో చంద్రబాబు మాట్లాడిన సెల్ ఫోన్ల విషయంలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. కారణం ఏమిటంటే మొబైల్ టెక్నాలజీని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని తానే దేశంలోకి తీసుకొచ్చానని చెప్పి  మరోసారి దొరికిపోయారు.నిజానికి మొబైల్ టెక్నాలజీతో కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో కానీ చంద్రబాబు ఎలాంటి సంబంధమూ లేదు. ఎక్కడన్నా ఏదైనా ప్లస్ జరిగితే అంతా తనవల్లే అని ఏదైనా మైనస్ ఉంటే ఎదుటి వాళ్ళమీదకు తోసేయటం చంద్రబాబుకు బాగా అలవాటు. 1995లో మొబైల్ టెక్నాలజీ ఇండియాలోకి ఎంటరైంది. 1995 జూలైలో అప్పటి కమ్యూనికేషన్ల శాఖ మంత్రి సుఖ్ రామ్-అప్పటి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతిబసు మొదటిసారి మొబైల్ ఫోన్లో మాట్లాడుకున్నారు.చంద్రబాబు సీఎం అయ్యింది 1995 సెప్టెంబర్లో. అంటే చంద్రబాబు ముఖ్యమంత్రయ్యే రెండునెలలకు ముందే ఇండియాలోకి మొబైల్ టెక్నాలజీ ఎంటరైపోయిందన్న విషయం అందరికీ తెలుసు. అందరికీ తెలిసిన విషయంలో ఎలాంటి సంబంధంలేకపోయినా గొప్పదనాన్ని తనకు తాను ఆపాదించుకోవటంలో చంద్రబాబు ఏమాత్రం సిగ్గుపడరు. ఏపిలో మొబైల్ టెక్నాలజీ ఎంటర్ కాకముందే తమిళనాడు, కర్నాటకలో ఎంటరైపోయాయి. మరి ఆ రాష్ట్రాల్లో మొబైల్ టెక్నాలజీని పరిచయంచేసింది కూడా చంద్రబాబేనా.ఇక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాన్ని తీసుకుంటే 1968లోనే టాటా కన్సల్టెన్సీ సర్వీస్ (టీసీఎస్) మొదలైంది. 1991లో పీవీ నరసింహారావు హయాంలో ఐటి విప్లవం అన్నీరంగాల్లోకి విస్తరించటం మొదలుపెట్టింది. చంద్రబాబు సీఎం అవటానికి చాలాకాలం ముందే ఐటి విప్లవం దేశంలో మొదలైపోయింది. అంటే తాను చెప్పుకున్న పై రెండు రంగాల్లో కూడా చంద్రబాబుకు ఎలాంటి పాత్రాలేదు. ఈ విషయం నెటిజన్లకు బాగా తెలుసుకాబట్టే చంద్రబాబుకు వ్యతిరేకంగా విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. అయినా ఇలాంటి వాటిని లెక్కచేసే వాడైతే, సిగ్గుపడే వాడైతే తాను చంద్రబాబు ఎందుకవుతాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: