సీఎం జగన్ కు ప్రశాంత్ కిషోర్ తో చెడిందా ?

VAMSI
ఆంధ్రప్రదేశ్ లో 2019 లో జరిగిన ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్థాపించిన పార్టీ అధికారంలోకి వచ్చిందంటే అందులో సగభాగం కృషి ప్రముఖ ఎన్నికల వ్యహకర్త ప్రశాంత్ కిషోర్ ది దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు తెలుసు. టీడీపీ లాంటి ఎంతో రాజకీయ అనుభవం ఉన్న పార్టీని ఎదుర్కొని వైసీపీ విజయం సాధించడంలో పీకే సూచనలు మరియు సలహాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ప్రస్తుతం జగన్ రాష్ట్ర వ్యాప్తంగా తాను మానిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను నెరవేర్చే పనిలో ఉన్నారు. గ్రామీణ ప్రజలు అంతా జగన్ పాలన పట్ల హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇక పట్టణ ప్రాంతాలలో మాత్రం అభివృద్ధి, పోలవరం మరియు ప్రత్యేక హామీల విషయంలో జగన్ ఫెయిల్ అయ్యారన్న విషయాలను చూపిస్తూ విమర్శలు చేస్తున్నారు. కాగా జగన్ కోసం ఎంతో కాష్టపడిన పీకే ప్రస్తుతం బీహార్ లో జనసురాజ్ అన్న పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా పీకే ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా అధిక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఏపీ సీఎం జగన్ కు నేను ఎందుకు సాయం చేశానో నాకు అర్ధం కావడం లేదు, అలా చేసి తప్పు చేశానన్న భావన నా మనసులో కలుగుతోంది అంటూ వ్యాఖ్యలు చేశారు.
ఆ సమయంలో నేను జగన్ కు హెల్ప్ చేయకుండా కాంగ్రెస్ ను అభివృద్ధి చేయడానికి కృషి చేసి ఉన్న బాగుండేది అంటూ అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలు చూస్తుంటే అదేంటి వచ్చే ఎన్నికల్లో కూడా పీకే వైసీపీ గెలుపుకు కృషి చేయాలని కోరుకుంటుంటే సడెన్ గా పీకే ఇలా షాక్ ఇచ్చాడు అంతో అంతర్మథనంలో పడ్డారు వైసీపీ శ్రేణులు. అసలు జగన్ కు పీకే కు మధ్యన ఏమి జరిగింది ? ఈ విధంగా కామెంట్ చేసేలా ఎందుకు చెడింది అన్న కోణంలో అభిమానులు ఆలోచిస్తున్నారు. ఇక అదే మీడియా సమావేశంలో బీహార్ సీఎం నితీష్ కుమార్ పై కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేయడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: