ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్..ఆ తప్పు చేస్తే అన్నీ బంద్..

Satvika
ప్రభుత్వ ఉద్యోగులకు కొన్ని నియమాలు వుంటాయి.. అంతేకాదు పండుగలు వస్తే బోనస్ లు కూడా ఇస్తారు.దీపావళి పండుగ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ అందించిన సంగతి తెలిసిందే. పండుగ ప్రారంభానికి ముందు డియర్‌నెస్ అలవెన్స్(డీఏ), డియర్‌నెస్ రిలీఫ్‌ల పెంచుతున్నట్లు వెల్లడించినట్లు తెలిసిందే..ఆ తర్వాత రైల్వే ఉద్యోగులకు పనితీరు అనుసంధాన ప్రోత్సాహకాలను ప్రకటించింది. ఈ నిర్ణయాల వల్ల లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు లబ్ది పొందారు. అటు జీతం, గ్రాట్యుటీ పెంపుతో రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ పెంచాలని నిర్ణయించింది. 



అందుకు సంబంధించిన కొత్త నిబంధనను కేంద్ర ఉద్యోగులకు అమలు చేయగా, క్రమంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అమలు చేస్తున్నాయి.పెన్షన్, గ్రాట్యుటీ ప్రయోజనాలు కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతున్నాయి. అయితే ఇందులోని ఒక నియమాన్ని గుర్తుంచుకోవాలి. ఇది విస్మరించదగిన లేదా విస్మరించబడే నియమం. ఈ నియమం సెంట్రల్ సివిల్ సర్వీసెస్(పెన్షన్) రూల్స్, 2021కి సంబంధించినది. ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా తన సర్వీస్‌లో ఏదైనా తీవ్రమైన తప్పిదానికి పాల్పడినట్లు తేలితే, అతడు డ్యూటీని విస్మరించినా, అతని పెన్షన్, గ్రాట్యుటీని నిలిపివేయవచ్చని ఈ నిబంధన చెబుతోంది.



ఏ ఉద్యోగి అయినా తప్పు చేసినట్లు తేలితే.. అతడి పెన్షన్, గ్రాట్యుటీ ప్రయోజనాలను నిలిపివేయవచ్చని.. దానిపై నిర్ణయం తీసుకునే హక్కు కొంతమంది ఉన్నతాధికారులకు ఇవ్వబడింది. ప్రెసిడెంట్, అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్‌మెంట్ సెక్రటరీ, ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఈ లిస్టులో ఉన్నారు.అక్టోబరు 7న ప్రచురించబడిన సవరించిన రూల్ 8 ప్రకారం, పదవీ విరమణ పొందిన వ్యక్తి ఏదైనా డిపార్ట్‌మెంట్‌లో “సర్వీస్ సమయంలో తీవ్రమైన దుష్ప్రవర్తన” చేసినట్లయితే.. పైన పేర్కొన్న ఏజెన్సీలకు అతడి పెన్షన్‌ను పూర్తిగా లేదా పాక్షికంగా రద్దు చేసే హక్కు ఉంటుంది. పెన్షన్ లేదా గ్రాట్యుటీని శాశ్వతంగా లేదా నిర్దిష్ట సమయం పాటు నిలిపివేయవచ్చు. ఒకవేళ తప్పు చేసిన ఉద్యోగికి పెన్షన్ లేదా గ్రాట్యుటీ ఇవ్వడం వల్ల ఆర్థికంగా నష్టం వాటిల్లిందని ప్రభుత్వశాఖ భావించినట్లయితే, ఆ ఉద్యోగి నుంచి పరిహారం తీసుకోవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: