హైదరాబాద్ : కోమటిరెడ్డికి అప్పుడే జ్వరం మొదలైపోయిందా ?

Vijaya






మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికలో పోటీచేస్తున్న బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డికి అప్పుడే జ్వరం వచ్చేసింది. మంగళవారం మొత్తం ఆయన ఇంటికే పరిమితైపోయారు. అభ్యర్ధి ప్రచారానికి ఎందుకు రాలేదని ఉదయం ఆరాలు తీసిన నేతలు, శ్రేణులకు కోమటిరెడ్డికి బాగా జ్వరంగా ఉన్నట్లు ఆయన పీఏ చెప్పారట. మొత్తానికి అభ్యర్ధి రోజంతా ఇంటికి మాత్రమే పరిమితమైపోయారు. దాంటో ఇంకా పోలింగ్ కూడా కాకుండానే బీజేపీ అభ్యర్ధికి అప్పుడే జ్వరం వచ్చేసిందనే సెటైర్లు పేలుతున్నాయి.



రాజగోపాలరెడ్డికి జ్వరం రావటం ఖాయమని మూడురోజుల ముందు నుండే నియోజకవర్గంలో ప్రచారం జరుగుతుండటం విశేషం. జరుగుతున్నది కేవలం ప్రచారం మాత్రమే కాదని అదంతా నిజమే అన్నట్లుగా మంగళవారం ఆయన జ్వరంపేరుతో ప్రచారానికి బ్రేక్ తీసుకున్నారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం జ్వరంపేరుతో బ్రేక్ తీసుకున్న రాజగోపాల్ నియోజకవర్గంలోని ప్రస్తుత పరిస్దితిని సినియర్ నేతలు, ఢిల్లీ పెద్దలతో పాటు తన అన్న, కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డికి ఫోన్లో వివరించినట్లు సమాచారం.



నిజానికి రాజగోపాల్ పరిస్దితి నియోజకర్గంలో చాలా బ్యాడ్ గా ఉంది. ఎక్కడ ప్రచారానికి వెళ్ళినా వ్యతిరేకత కనబడుతోంది. రాజీనామాకు ముందు తనను తాను చాలా ఎక్కువగా అంచనా వేసుకున్న రాజగోపాల్ కు ఇపుడు చుక్కలు కనబడుతున్నాయి. గ్రామాల్లో ప్రజలు అభ్యర్ధిని నిలదీస్తున్నారు. సొంత డబ్బులతో గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని 2018 ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఆ హామీని నమ్మిన జనాలు ఓట్లసి గెలిపించారు.



అయితే అప్పటినుండి మళ్ళీ ఇప్పటివరకు రాజగోపాల్ తన హామీని పూర్తిగా మరచిపోయారు. రు. 18 వేల బొగ్గు కాంట్రాక్టు కోసమని కాంగ్రెస్ నుండి బీజేపీలోకి జంప్ అయ్యారనే విషయం జనాలందరికీ బాగా అర్ధమవటంతో ప్రతిచోటా నిలదీస్తున్నారు. దాంతో రాజగోపాలరెడ్డిలో ఓటమి భయం మొదలైనట్లుంది అందుకనే ఫీవర్ వచ్చేసిందంటు సెటైర్లు పేలుతున్నాయి. పోలింగ్ ఇంకా పదిరోజులుండగానే రాజగోపాల్ జ్వరమని ఇంట్లో పడుకుంటే ఎలాగంటు సొంతపార్టీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. మొత్తానికి వచ్చింది ఏ జ్వరమో రాజగోపాలే చెప్పాలేమో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: