దేవుడా..మనుషులు ఎలా తయారయ్యారురా బాబు..

Satvika
కరోనా తర్వాత మనుషులకు మానవత్వం లేకుండా పోయింది..ఏది చిక్కితే అది దోచుకుంటున్నారు.. ఏదైనా వాహనాల కు ప్రమాదం జరిగితే అందులో ఉన్న వాళ్ళకు ఏమైంది అనుకోరు..అందులో ఏమున్నాయి మనకు పనికి వస్తాయా లేదో అని చూడటం..ఆఖరికి ఫినాయిల్ అయిన కూడా వదలకుండా తీసుకుని పోతున్నారు.. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా మరో ఘటన వెలుగు చూసింది.. ఈ ఘటన ను చూసిన వారంతా కాసేపు పరుగులు పెట్టారు.. మరికొంత మంది మనకెందుకు అని సైడ్ అయ్యారు..మొత్తానికి ఇది అందరికి విందును ఇచ్చింది.

కోళ్ల లోడ్‌తో వెళ్తున్న డీసీఎం వాహనం అదుపుతప్పి బోల్తా పడడంతో గ్రామస్తులు పండగ చేసుకున్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామం నుండి సిద్ది పేటకు 1200 కోళ్లు తీసుకొని వెళ్తున్న వాహనం అదుపుతప్పి బోల్తా పడింది.. కోళ్లు చెల్లాచెదురుగా పడిపోయాయి. విషయం తెలుసుకున్న లక్ష్మాపూర్ గ్రామస్తుల తో పాటు రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు దొరికిన కోళ్లను దొరికినట్టుగా తీసుకెళ్లారు. కొన్ని కోళ్లు రోడ్డు పక్కనే ఉన్న వరిపొలంలో పడ్డాయి. కోతకు వచ్చిన వరి పొలం అని కూడ చూడకుండా కోళ్ల కోసం పొలంతోకి దిగారు కొందరు. దొరికాయ్‌రా నా సామి రంగా అంటూ ఇళ్లకు పరుగులు తీశారు.


కొందరైతే ఒక కోడితో సరిపెట్టుకోలేదండి. రెండు చేతుల్లో వీలునన్ని పట్టుకుని అక్కడి నుంచి ఉడాయించారు. కాగా వరిపొలం రైతు కోళ్ల కోసం వచ్చినవారి పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. కోళ్ల కోసం పొట్టకొచ్చిన వరి పొలాన్ని కూడా పట్టించుకోలేదంటూ సీరియస్ అయ్యాడు. కాగా 800 కోళ్లను మాయం చేసినట్టు డ్రైవర్ తెలిపాడు. ఈ ప్రమాదం లో అతడికి స్వల్ప గాయాలయ్యాయి. పాపం డ్రైవర్‌కు దెబ్బలు తగిలాయా అని ఎవరూ చూడలేదు. కోళ్లు చిక్కినవాళ్లు సాయంత్రం దావత్ అనకుంటూ సబంరంగా ఇంటికి వెళ్లారు.. ఫుల్లుగా లాగించారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: