31 నుంచి 'కోటి దీపోత్సవం'

shami
కార్తీక మాసం వచ్చిందంటే చాలు.. అందరి చూపు ఎన్టీవీ-భక్తి టీవీ నిర్వహించే 'కోటి దీపోత్సవం'పైనే ఉంటుంది.. భక్తుల, ప్రేక్షకుల మదిలో అజరామరమైన స్థానాన్ని సంపాదించుకుంది.. 2012లో రచన టెలివిజన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్ అధినేత నరేంద్ర చౌదరి, రమాదేవి పుణ్య దంపతుల సంకల్పంతో ఈ దీపోత్సవానికి అంకురార్పణ జరిగింది.. తొలిసారిగా 2012లో లక్ష దీపాలతో ప్రారంభమైన ఈ మహాదీపయజ్జం.. మరుసటి ఏడాది నుంచే కోటిదీపోత్సవంగా మారింది.. క్రమంగా ఆధ్యాత్మిక జగత్తులో మహోద్యమంగా కొనసాగుతోంది.
ప్రతీ ఏడాది నిరాటంకంగా కొనసాగుతోంది. ఆ కైలాసమే ఇలకి దిగివచ్చిందా అనేలా.. కోటిదీపోత్సవ వేదిక ముస్తాబవుతోంది.. ఒకే వేదికగా కోటి దీపాలు పండుగే కాదు.. ఘనాపాఠీల వేదపారాయణాలు, జగద్గురువుల అనుగ్రహ భాషణాలు, పీఠాధిపతుల దివ్య ఆశీర్వచనాలు, మాతృశ్రీల మంగళశాసనాలు దీపోత్సవానికి ఆధ్యాత్మిక శోభను సంతరిస్తాయి. ఈ వేదికగా మహాదేవునికి ప్రీతికరమైన అభిషేకాలు, బ్రహ్మోత్సవంగా వివిధ వాహన సేవలు, వైభవంగా దేవీదేవతల కల్యాణాలు, విశేష పూజలు ఎన్నో భక్తుల మనసులను భక్తిపారశ్యంతో ముంచేస్తాయి.. ఇక, ఈ ఏడాది అక్టోబర్‌ 31వ తేదీతో ఆరంభమై.. నవంబర్‌ 14వ తేదీ వరకు కొనసాగనుంది కోటిదీపోత్సవం.
ఎన్టీవీ నంబర్‌ వన్‌ తెలుగు న్యూస్‌ చానెల్‌గా నిలవడం.. భక్తి టీవీ.. భక్త జగత్తులో ప్రత్యేక స్థానాన్ని పొందడం.. మరోవైపు.. దీపాల ఉత్సవానికి అంకురార్పణ జరిగి పదేళ్లు అవుతుతోన్న సందర్భాన్ని పురస్కరించుకుని.. అక్టోబర్‌ 31వ తేదీ నుంచి ప్రారంభమయ్యే కోటి దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది రచనా టెలివిజన్‌.. 31వ తేదీ నుంచి ప్రతిరోజూ పసాయంత్రం 6 గంటలకు ఎన్టీఆర్‌ స్టేడియంలో ఈ ఉత్సవం 15 రోజుల పాటు కొనసాగనుంది..
భక్తుల కోసం ఎన్టీవీ చేపట్టిన ఈ మహాయజ్ఞానికి చాలా ప్రత్యేకత ఉంది.. ఒకే వేదికపై దేవీదేవతల కల్యాణాలు జరిపిస్తోంది.. వివిధ క్షేత్రాల నుంచి ఉత్సవ మూర్తులను ఆలయ లాంఛనాలతో తీసుకువచ్చి ఆగమసంప్రదాయాన్ని అనుసరించి ఆయా ఆలయాల అర్చకస్వాములతో కల్యాణం జరిపించడం ఈ కోటిదీపోత్సవం వేదికగా సాధ్యమైంది.. దీపారాధన ముగిసిన వెంటనే లిగోద్భవ దృశ్యాన్ని ఆవిష్కిస్తారు.. లింగాష్టకం నేపథ్యంలో లిగోద్భవం ఒక మహోత్సవంగా జరుగుతుంది.. కల్యాణ మూర్తలులందరికీ ప్రతిరోజూ వాహనసేవ. కోలాట బృందాలు ముందు నడుస్తుండగా.. ఆ ఉత్సవ మూర్తులు.. ప్రజల దగ్గరకు తరలివస్తారు.. హైదరాబాద్‌తో మాటు.. తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తుల తరలివచ్చే ఈ మహా దీపయజ్ఞాన్ని ఒక్కసారైనా చూసి తరలించాల్సిందే.. పాల్గొని పరవశించాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: