రేషన్ కార్డుదారులకు అలర్ట్ ..ఆ నెంబర్ తప్పనిసరిగా అప్డేట్ చెయ్యాలి..

Satvika
దేశంలో ఉన్న ప్రజలందరికీ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఏదొక పథకాలను అమలు చేస్తుంది..అహార కొరతను తీర్చెందుకు రేషన్ కార్డులు తప్పనిసరి..దేశంలోని దాదాపు 80 కోట్ల మంది ప్రజలకు ప్రభుత్వం రేషన్ కార్డు ద్వారా ఉచిత రేషన్ అందిస్తోంది. దేశంలో రేషన్ కార్డ్ చాలా ముఖ్యమైనది. ఆధార్ కార్డు మాదిరిగానే చాలా పనులకు రేషన్ కార్డు కూడా చాలా ముఖ్యమైనది. కుటుంబంలోని ప్రతీ ఒక్కరి పేరు రేషన్ కార్డులో రిజిస్టర్ చేయడం జరుగుతంది. అయితే, రేషన్ కార్డు ఉపయోగం పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని సూచిస్తూనే ఉంది.

ఇటీవల రేషన్ కార్డులో అవసరమైన అప్డేట్స్ కోసం ప్రభుత్వం పలు సూచనలు జారీ చేసింది. ఆ అప్డేట్స్ చేయకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుందని హెచ్చరించింది. రేషన్ కార్డు లబ్ధిదారులు తమ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ చేయాలని సూచించింది..రేషన్ కార్డు లబ్దిదారులు చాలాసార్లు తమ ఫోన్ నెంబర్ను మారుస్తూ ఉంటారు. అది రేషన్ కార్డు విషయంలో ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. రేషన్ కార్డుకు సంబంధించిన అప్డేట్ల వివరాలు వారు పొందలేకపోతారు. ఈ నేపథ్యంలో రేషన్ కార్డులోని మొబైల్ నెంబర్ను అప్డేట్ చేయడం చాలా ముఖ్యం. ఒకవేళ మీ రేషన్ కార్డులో పాత నెంబర్ ఉంటే ఆందోళన చెందాల్సిన అసరం లేదు.
ఆన్లైన్ లో మొబైల్ నెంబర్ ను ఎలా అప్డేట్ చేసుకోవాలంటే..

1.ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక రేషన్ కార్డు జారీ చేయబడుతుంది.
2. రేషన్ కార్డ్లో మొబైల్ నంబర్ను అప్డేట్ చేయాలనుకుంటే.. మీ రాష్ట్ర రేషన్ కార్డ్ వెబ్సైట్ను సందర్శించాలి.
3. ఉదాహరణకు ఢిల్లీలో నివసిస్తున్నట్లయితే, రేషన్ కార్డును అప్డేట్ చేయడానికి ముందుగా https://nfs.delhigovt.nic.in/Citizen/UpdateMobileNumber.aspx వెబ్సైట్ను క్లిక్ చేయాలి.
4. ఆ తర్వాత పేజీలో మీ 'రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ అప్డేట్' అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
5. ఆ తర్వాత రేషన్ కార్డ్ హోల్డర్ ఆధార్ నంబర్, రేషన్ కార్డ్ నంబర్, కొత్త మొబైల్ నంబర్ సహా అవసరమైన సమాచారాన్ని ఫిల్ చేయాలి.
6. ఆ తర్వాత క్యాప్చా కోడ్ను నమోదు చేసి, సేవ్ ఆప్షన్పై క్లిక్ చేయాలి.
7. దీని తర్వాత కొత్త మొబైల్ నంబర్ మీ రేషన్ కార్డ్లో అప్డేట్ చేయబడుతుంది.
ఆఫ్‌లైన్‌లో..

ఆఫ్‌లైన్ ప్రక్రియ ద్వారా కూడా రేషన్ కార్డ్‌లో మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేయవచ్చు. ఇందుకోసం ముందుగా రాష్ట్ర ఆహార శాఖకు దరఖాస్తు చేసుకోవాలి. ఈ దరఖాస్తును రాష్ట్ర ఆహార అధికారికి ఇవ్వాలి. రేషన్ కార్డు కాపీ, మీ మొబైల్ నంబర్‌ను కూడా నమోదు చేయాల్సి ఉంటుంది..అలా మొబైల్ నెంబర్ అప్డేట్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: