"ఎన్టీఆర్ పేరును తొలగించడం" జగన్ కు పెద్ద దెబ్బే ?

VAMSI
ప్రస్తుతం ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఒకే ఒక్క విషయంపై చర్చ జరుగుతోంది, తాజాగా ఏపీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యచకితులను మరియు కోపోద్రిక్తులను చేస్తోంది అని చెప్పాలి. మాములుగా రాష్ట్రంలో ఎవరి ప్రభుత్వం ఉంటే వారికి అనుకూలంగా అన్నింటినీ సాధ్యం అయినంతవరకు మార్చేస్తూ ఉంటారు. కానీ అన్ని సార్లు ఇవి వర్క్ అవుట్ కావు... కొన్ని సార్లు రివర్స్ అవుతాయి. సరిగ్గా ఇప్పుడు జగన్ కు అదే జరిగింది. శాసనసభ సమావేశాల్లో జగన్ ప్రభుత్వం కొత్త బిల్లును తీసుకు వచ్చింది. ఇప్పటికే స్వర్గీయ ఎన్టీఆర్ పేరు మీద ఉన్న హెల్త్ యూనివర్సిటీ ని కాస్త ఉమ్మడి రాష్ట్రాల సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును (వైఎస్సార్) పెట్టిన సంగతి తెలిసిందే.
సభా నియమాల ప్రకారం ఎక్కువ మంది ఆమోదం పొందగానే దానికి శాసనం చేయబడుతుంది. అలా ఈ బిల్లు పాస్ అయింది. కానీ దీని వలన జగన్ కు బయట బాగా వ్యతిరేకత పెరుగుతోంది. ప్రతిపక్షాలు ఈ నిర్ణయంపై నిప్పులు చెరుగుతున్నారు. అయితే వైసీపీ లో ఉన్న అధికార భాషా సంఘం చైర్మన్ యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ సైతం ఈ నిర్ణయాన్ని తప్పుబడుతూ తన పదవికి రాజీనామా చేశారు. ఇక టీడీపీ నుండి గెలిచినా వైసీపీకి మద్దతు పలుకుతున్న గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా జగన్ ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే జగన్ చెల్లెలు షర్మిల సైతం తప్పు బట్టడం ఇప్పుడు వైరల్ గా మారుతోంది.
అన్న నిర్ణయాన్ని సమర్ధించకుండా తప్పు బడుతోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఇప్పటికే ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత చాలక, కొత్తగా ఇదొక్కటి పడింది. ప్రజల్లో ఎన్టీఆర్ కు ఎంత అభిమానం ఉందో తెలియంది కాదు. ఈ విషయాన్ని అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాలు సరిగ్గా గేమ్ ఆడితే వైసీపీ కి కష్టకాలమే. మరి దీని నుండి ఏ విధంగా జగన్ ప్రజలను డైవర్ట్ చేస్తాడు అన్నది చూడాల్సి ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: