పవన్ కళ్యాణ్ యాత్రకు బస్సు రెడీ..దసరా నుంచే యాత్ర..

Satvika
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలను మాత్రమే కాదు..మరోవైపు సొంతంగా పార్టీని పెట్టి రాజకీయాల లో కూడా బిజిగా ఉన్న సంగతి కూడా తెలిసిందే..గతంలో దూరంగా ఉన్నా, ఈ ఏడాది స్వయంగా ఎన్నికల బరిలో దిగాలని సర్వం సిద్దం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రం నలుమూలల నుంచి పర్యటనలు చేస్తూ ప్రజలకు దగ్గర కావాలని చూస్తున్నారు..ఈ మేరకు పాద యాత్రను కూడా  చేశారు.ఇప్పుడు బస్సు యాత్ర చేసేందుకు రెడీ అవుతున్నారు.

రాజకీయాల్లో ప్రజాప్రతినిధులు చేసే యాత్రలకు ఒక ప్రత్యేక స్థానం… చరిత్ర ఉంది. ప్రజల కష్ట నష్టాలను తెలుసుకునేందుకు.. అక్కడి పరిస్థితులను స్వయంగా తెలుసుకోవాలని అనేక పార్టీ ప్రతినిధులు పాదయాత్ర, బస్సు యాత్రలను చేశారు. ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు, వైఎస్సార్ నుంచి ప్రస్తుత సీఎం జగన్ వరకూ యాత్రలు చేసి.. ప్రజలను ఆకట్టుకుని తమ లక్షలను అందుకుని సీఎం పీఠాన్ని అధిరోహించిన వారే.. తాజాగా ఏపీలో మరో యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. అక్టోబర్ 5నుంచి ఏపీలో బస్సు యాత్రను చేయనున్నారు.

ఈ నేపథ్యంలో పవన్ యాత్ర కోసం హైదరాబాద్ లో వాహనాన్ని రెడీ చేస్తున్నారు. తమ అభిమాన నేత యాత్ర సందర్భంగా పార్టీ శ్రేణులు ఏర్పాట్లు శరవేగంగా చేస్తున్నారు. అయితే ప్రస్తుతం పవన్ బస్సు యాత్రకు వినియోగించనున్న ఓ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది.. ఈ బస్సు ను ఎన్టీఆర్ ఉపయోగించిన చైతన్య రథాన్ని పోలి ఉంది..

ప్రస్తుతం ఈ బస్సు తుది మెరుగులు దిద్దుకోనెపనిలొ ఉంది..బస్సు టాప్ నుంచి పవన్ కనిపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. యాత్ర జరిగినన్ని రోజులు బస్సులోనే పవన్ ఉంటారు.. అవసరాలకు తగ్గట్లు ఆ బస్సును నిర్మించనున్నారు.ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ ఏ ప్రాంతంనుంచి పవన్ యాత్ర ప్రారభించనున్నారనేది 18న అనౌన్స్ చెయ్యనున్నారు.అప్పుడే ఆ యాత్ర పూర్తి వివరాలను కూడా తెలపనున్నట్లు సమాచారం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: