వరి: తగ్గనున్న ఉత్పత్తి?

Purushottham Vinay
ఇక దేశంలో ఈ సంవత్సరం వరి ఉత్పత్తి బాగా తగ్గవచ్చని సమాచారం తెలుస్తోంది. అయితే ఈ సారి దేశంలో 12 మిలియన్ టన్నుల మేర వరి ఉత్పత్తి తగ్గవచ్చని కేంద్ర ఆహార కార్యదర్శి సుధాన్షు పాండే వెల్లడించారు.ఇంకా అలాగే కొన్ని రాష్ట్రాల్లో వర్షాలు తక్కవగా కురవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. అయితే దేశంలో ఇప్పటి వరకు వరి స్టాక్ మిగులు ఉందని వెల్లడించారు. నాలుగు రాష్ట్రాల్లో తక్కువ వర్షపాత వరి ఉత్పత్తిపై ప్రభావం చూపించనుందని ఆయన అన్నారు. అయితే రుతు పవనాల కారణంగా ఈ ఏడాది కొన్ని రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిశాయని.. ఆ రాష్ట్రాల్లో వరి దిగుబడి పెరుగుతుందని పాండే వెల్లడించారు. అయినా దేశంలో వరి నిల్వలు సర్ ప్లస్ లోనే ఉంటాయని తెలిపారు.ఈ ఖరీఫ్ సీజన్ లో ఇప్పటి వరకు చాలా రాష్ట్రాల్లో తక్కువ వర్షపాతం నమోదు అయింది. దీంతో వరి సాగు విస్తీర్ణం 38 లక్షల హెక్టార్లు తగ్గిందని పాండే అన్నారు.


ఖరీఫ్ సీజన్ లోనే భారతదేశంలో ఎక్కువ వరి ఉత్పత్తి అవుతుంది. 80 శాతం వరి ఉత్పత్తి ఒక్క ఖరీఫ్ సీజన్ నుంచే వస్తుంది. చాలా అధ్వాన్న పరిస్థితుల్లో బియ్యం ఉత్పత్తి నష్టం 10 మిలియన్ టన్నుల వరకు ఉండవచ్చని.. అయితే ఈ ఏడాది 12 మిలియన్ టన్నుల వరకు ఉండొచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తర్ ప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో వరినాట్లు 25 లక్షల హెకార్లు తక్కువగా పడ్డాయి.ఇక గత ఆరు సంవత్సరాలుగా దేశంలో పంటల దిగుబడి చాలా బాగుంది. అయితే ప్రస్తుతం ఏర్పడిన వాతావరణ పరిస్థితులు ఈ ఏడాది ప్రభావం చూపించనున్నాయి. కోవిడ్ మహమ్మారి సమయంలో కూడా అన్ని రంగాలు కుంటుపడినా.. వ్యవసాయ రంగం ఆదుకుంది. ఇప్పటికే మే నెలలో ఉష్ణోగ్రతల కారణంగా గోధుమ పంటపై ప్రభావం చూపింది. గోధుమలను ఇతర దేశాలకు ఎగుమతి చేయాడాన్ని బ్యాన్ చేసింది ఇండియా. తాజాగా నూకల ఎగుమతులను కూడా నిషేధించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: