రాయలసీమ : చంద్రబాబు ట్రాపులో వైసీపీ పడిపోయిందా ?

Vijaya




అధికారంలో ఉన్నపార్టీ సంయమనం పాటించాలి. ప్రతిపక్షం ఎలాంటి దుందుకుడు చర్యలకు పాల్పడినా అధికారపార్టీ కాస్త సంయమనం పాటిస్తే సమాజం ప్రశాంతంగా ఉంటుంది. జనాలు కూడా ఓవర్ చేసిన వాళ్ళని ఎప్పటికీ క్షమించరు. కానీ కుప్పంలో వైసీపీ మాత్రం చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నట్లే ఉంది. మూడురోజుల పర్యటన నిమ్మితం చంద్రబాబు బుధవారం కుప్పం చేరుకున్నారు. పర్యటన మొదలుకావటమే గొడవలతో మొదలైంది.



ఇక్కడ గమనించాల్సిందేమంటే కుప్పం నియోజకవర్గంలో టీడీపీ బాగా వీకైపోతోంది. రేపటి ఎన్నికల్లో చంద్రబాబు గెలవరని వైసీపీ నేతలు చాలా స్పష్టంగా చెబుతున్నారు. చంద్రబాబును ఓడగొట్టేందుకు ప్రభుత్వం తరపున, పార్టీ తరపున కూడా జగన్మోహన్ రెడ్డి అవసరమైన వ్యూహాలను అమలుచేస్తున్నారు. మరింతోటిదానికి వైసీపీ ఎందుకు గొడవలు చేస్తోంది ?  ఎందుకంటే వైసీపీ నేతలు గొడవలు చేసేట్లుగా టీడీపీయే వ్యూహం పన్నినట్లుంది.



కావాలనే అధికారపార్టీ నేతలు చంద్రబాబు+లోకల్ నేతలు రెచ్చగొడుతున్న విషయం అర్ధమైపోతోంది. సెంటిమెంటును రేకెత్తించటం ద్వారా జనాలను ఆకట్టుకోవాలన్నది చంద్రబాబు ప్లాన్ లాగుంది. అందులో వైసీపీ నేతలు ఇరుక్కున్నారు. అసలు కుప్పంలో చంద్రబాబు పర్యటిస్తే వైసీపీ నేతలు ఎందుకు స్పందించాలి ? గురువారం బస్టాండ్ సమీపంలోని అన్నక్యాంటిన్ను ఎందుకు ధ్వంసంచేయాలి ? పేదలకు పట్టెడన్నంపెట్టే క్యాంటిన్ పై వైసీపీ నేతలు దాడులు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ?



ఇదంతా టీడీపీ చేసిన గేమ్ ప్లాన్ లాగే అనుమానంగా ఉంది. కొద్దిగా రెచ్చగొడితే చాలు వైసీపీ నేతలు రెచ్చిపోతారని చంద్రబాబుకు బాగా తెలుసు. అందుకనే బయటకు కనబడకుండా లోలోపలే వైసీపీ నేతలను రెచ్చగొట్టారు. దాంతో బుధ, గురువాల్లో నియోజకవర్గంలో బాగా ఉధ్రిక్తలు పెరిగిపోయాయి. వైసీపీ ఓవర్ యాక్షన్ చూసిన తర్వాత జనాలకు చంద్రబాబుపై సింపతి పెరిగితే అది ముమ్మాటికి వైసీపీ తప్పే అవుతుంది. చంద్రబాబు పర్యటనకు వైసీపీ నేతలు అనవసరంగా ప్రాధాన్యతిచ్చి రాష్ట్రస్ధాయిలో ప్రచారం వచ్చేట్లు చేశారు. ఎలాగూ చంద్రబాబుకు మద్దతుగా ఎల్లోమీడియా ఉందన్న సంగతి మరచిపోయినట్లున్నారు. కాబట్టి ఇకనుండైనా వైసీపీ నేతలు ఓవర్ యాక్షన్ మానేసి చంద్రబాబును పట్టించుకోకుంటే సరిపోతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: