హైదరాబాద్ : ఈడీ రాడార్లో టీఆర్ఎస్ ప్రముఖులు ?

Vijaya


వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాల్సిందే అని బీజేపీ చాలా వ్యూహాలు పన్నుతోంది. ఇందులో కీలకమైనది ఏమిటంటే కేసీయార్+ఆయన సన్నిహితులపై 24 గంటలూ నిఘాపెట్టడం. ఇందుకనే ఎన్ఫోర్స్ మెంటు డైరెక్టరేట్ (ఈడీ)లోని కొందరు ముఖ్యమైన అధికారులకు బాధ్యతలు కూడా అప్పగించినట్లు సమాచారం. అంటే కేసీయార్ తొ పాటు కొందరు సన్నిహితులు ఇప్పటికే ఈడీ రాడార్లోకి చేరుకున్నారట. వచ్చే ఎన్నికల్లో కేసీయార్ గెలుపుకు ఎవరెవరు సహకిస్తారు ? ఆర్ధిక అండదండలు అందించేదెవరనే వివరాలాను ఈడీ పూర్తిగా సేకరించిందట.ఇక్కడ రెండు విధాలుగా టీఆర్ఎస్ ను దెబ్బకొట్టచ్చు. మొదటిదేమో కుంభస్ధలాన్నే బద్దలు కొట్టడం. రెండో పద్దతి ఏమిటంటే చెట్టును మోడుగా మార్చాలంటే దానికున్న కొమ్మలన్నింటినీ నరికేయటం. ఈ రెండింటిలో ఈడీ రెండోపద్దతిని ఎంచుకున్నట్లుగా ప్రచారంలో ఉంది. అందుకనే కేసీయార్ సన్నిహితులపైన ప్రత్యేకంగా నిరంతర నిఘాను ఉంచినట్లు పార్టీలోనే చర్చలు జరుగుతున్నాయి. కేసీయార్ కు బాగా సన్నిహితులైన ఇద్దరు ముగ్గురితో బీజేపీ అగ్రనేతలు ఢిల్లీకి పిలిపించుకుని మాట్లాడారని సమాచారం.
ఢిల్లీకి వెళ్ళొచ్చిన మాట్లాడిన వారంతా కేసీయార్ కు అన్నీ విధాలుగా అవసరమైనపుడు అండదండలందిస్తున్న వారేనట. వచ్చే ఎన్నికల్లో కేసీయార్ కు అవసరమైన ఆర్ధిక వనరులు అందకుండా చూడటమే బీజేపీ కీలక టార్గెట్ గా పెట్టుకుంది. ఇదే సమయంలో టీఆర్ఎస్ లో ఉన్నవారిలో ఎవరెవరిమీద ఎలాంటి కేసులున్నాయి ? వాటి తీవ్రత ఎంత ? అనే దానిపై ఇప్పటికే ఈడీ పూర్త సమాచారం తెప్పించుకున్నదట.అవసరమైనపుడు తమ ఆపరేషన్ చేయటానికి వీలుగా నగరంలోని ఆల్వాల్ ప్రాంతంలో ఈడీ ఆఫీసు కూడా తీసుకున్నదంటున్నారు. ఏదేమైనా కేసీయార్ కట్టడికి బీజేపీ అందుబాటులో ఉన్న అన్నీ అవకాశాలను ఉపయోగించుకుంటున్నది వాస్తవం. ఝార్ఖండ్ లో సీఎంకు అత్యంత సన్నిహితులిద్దరిపై ఈడీ కేసులుపెట్టింది. మహారాష్ట్రలో ఎన్సీపీకి చెందిన ఇద్దరు మంత్రులతో పాటు శివసేన కీలకనేత సంజయ్ రౌత్ ను అరెస్టులు చేసింది. పశ్చిమబెంగాల్ మాజీమంత్రి పార్ధాచటర్జీని అరెస్టుచేసి లోపలేసింది. ఈమధ్యనే ఈడీ కేసులుపెట్టి అరెస్టులు చేసిన ఘటనలు చూస్తున్న టీఆర్ఎస్ ప్రముఖుల్లో ఎప్పుడేమవుతుందో అనే టెన్షన్ పెరిగిపోతోందన్నది వాస్తవం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: