అమరావతి : ఎల్లో గ్యాంగ్ నోళ్ళు మూతపడిపోయాయా ?

Vijaya


ఒకే ఒక్క రాజీనామా ప్రకటనతో  వైఎస్ విజయమ్మ ఎల్లోగ్యాంగ్ నోళ్ళు మూయించేశారు. విజయమ్మ దెబ్బకు గ్యాంగ్ నోళ్ళు లేవటంలేదు. ఇంతకీ విషయం ఏమిటంటే శుక్రవారం మొదలైన  రెండు రోజుల ప్లీనరీలో పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ మాట్లాడారు. ఈ సందర్భంగా గౌరవాధ్యక్షురాలిగా తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కష్టాల్లో ఉన్న కొడుకు జగన్మోహన్ రెడ్డికి అండగా తాను నిలిచిన విషయాన్ని గుర్తుచేశారు.ఇపుడు ముఖ్యమంత్రి హోదాలో జగన్ హ్యాపీగా ఉంటే తెలంగాణాలో పార్టీ పెట్టుకున్న కూతురు షర్మిల విషయాన్ని ప్రస్తావించారు. తెలంగాణాలో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలిగా షర్మిల కష్టాన్ని పంచుకునేందుకే తాను చురుకైన పాత్ర పోషించాలని అనుకున్నట్లు చెప్పారు. రక్తం పంచుకున్న బిడ్డగా కూతురు కష్టంలో ఉన్నపుడు అండగా ఉండాల్సిన  బాధ్యత తల్లిగా తనకుందని విజయమ్మ స్పష్టంగా ప్రకటించారు. దీంతో ఎల్లోగ్యాంగ్ కు ఏ విధంగా స్పందించాలో అర్ధం కావటంలేదు.
ఎందుకంటే ఇంతకాలం ముఖ్యమంత్రి అవ్వగానే చెల్లిని, తల్లిని జగన్ తరిమిశారని నానా రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. తల్లితో బలవంతంగా జగన్ గౌరవాధ్యక్షురాలి పదవికి రాజీనామా చేయిస్తున్నారంటు పిచ్చిరాతలన్నీ రాస్తున్నారు. నిజానికి గౌరవాద్యక్షురాలిగా విజయమ్మ పాత్ర చాలా పరిమితమన్న విషయం తెలిసిందే. వైసీపీ అధికారంలోకి వచ్చిందంటే నూటికి నూరుశాతం జగన్ రెక్కల కష్టంమీదే. అలాంటిది పార్టీకి తన తల్లి గౌరవాధ్యక్షురాలిగా ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. అలాంటిది తల్లితో బలవంతంగా రాజీనామా చేయించారన్న రాతల్లో లాజిక్ లేదు. ఏదో జగన్ పై బురదచల్లేయాలన్న ఉద్దేశ్యంతో ఎల్లోగ్యాంగ్ తల్లి, చెల్లిని అడ్డం పెట్టుకుంటున్నారని అందరికీ తెలుసు.
తాజాగా టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత మాటలే నిదర్శనం. రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించటానికే విజయమ్మ ప్లీనరీకి వచ్చినట్లు చెప్పారు. వైసీపీలో విజయమ్మ ఎప్పుడూ కీలకపాత్ర పోషించిలేదన్నారు. పార్టీ సమావేశాల్లో కూడా ఎప్పుడూ పాల్గొనలేదన్న విషయాన్ని గుర్తుచేశారు. ఇక్కడే అనిత మాటల్లో డొల్లతనం కనబడుతోంది. పార్టీ సమావేశాల్లో ఎప్పుడూ పాల్గొనని, కీలకపాత్ర పోషించని విజయమ్మను జగన్ బలవంతంగా రాజీనామా చేయించాల్సిన అవసరం ఏముంది ? ఏదో బురదచల్లాలి కాబట్టి చల్లుతున్నారని అందరికీ అర్ధమైపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: