అల్లూరి స్ఫూర్తిగా అడుగులు వేస్తాం : జనసేనాని

Purushottham Vinay
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఘన నివాళులర్పిం చారు. అల్లూరి అడుగు జాడల్లో నడుస్తామని అన్నారు.ఇక అల్లూరిని స్ఫూర్తిగా తీసుకుని ప్రజలకు సేవ చేస్తామని అన్నారు.వాస్తవానికి బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన పార్టీ ... సోమవారం నాడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అల్లూరి 125వ జయంతిని పురస్కరించుకుని కార్యక్రమం కూడా నిర్వహించారు. దీనికి ప్రధాన మంత్రి మోడీ హాజరయ్యారు. అయితే ఇక బీజేపీ పొత్తు పార్టీ కాబట్టి.. జనసేనను కూడా పిలుస్తారని కూడా అందరూ అనుకున్నారు.కానీ ఏం జరిగిందో ఏమో కానీ పవన్ మాత్రం రాలేదు. అయితే.. పవన్ కళ్యాణ్ అల్లూరికి విడిగా నివాళి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. అణచివేతలో ఉద్భవించిన విప్లవాగ్ని అల్లూరి సీతారామరాజు అని జనసేన అధినేత అయిన పవన్ కల్యాణ్ ప్రశంసించారు. ప్రజల సంపద ప్రాణాలకు పాలకులే భక్షకులైన రోజు అంటూ కూడా కామెంట్ చేశారు. ఇక అవినీతి పక్షపాతానికి గురైన సమయంలో ప్రభుత్వాలను కూకటివేళ్లతో పెకలించే వీరులు ఉదయిస్తారని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చెప్పారు.


ఇంకా గిరిపుత్రులకు బతుకుపోరాటం నేర్పి ఆ పోరాటంలోనే అమరుడైన విప్లవజ్యోతి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ఆ మహావీరుడికి నమస్సుమాంజలి అర్పిస్తున్నానని పవన్ కల్యాణ్ తెలిపారు.అలాగే గిరిపుత్రుల హక్కుల కోసం చిన్న వయసులో విప్లవబాట పట్టాడని గుర్తు చేశారు.కేవలం 27 ఏళ్లకే అమర వీరత్వం పొందిన సీతారామరాజు దేశ స్వాతంత్రోద్యమానికి దివిటీగా మారడం తెలుగుజాతికి గర్వకారణం అని కామెంట్ చేశారు.ఇక ఎక్కడ పాలకులు గతి తప్పుతారో ఎక్కడ పాలకులు దోపిడీదారులుగా మారతారో అక్కడ సీతారామరాజు స్ఫూర్తితో వీరులు పుడుతూనే ఉంటారని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తెలిపారు. మన్యం వీరుడు జన్మించిన పుణ్యభూమిపై జన్మించడం తన అదృష్టంగా భావిస్తున్నా అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.ఇక ఏ లక్ష్యం కోసం అల్లూరి సీతారామరాజు అమరుడయ్యాడో ఆ లక్ష్యంతో జనసేన పార్టీ ముందుకు సాగుతుందని వెల్లడించారు.అలాగే విప్లవ జ్యోతికి తన పక్షాన జనసైనికుల పక్షాన నివాళులు అర్పిస్తున్నానని ఒక ప్రకటనలో తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: