పెట్రోల్, డీజిల్ : మళ్ళీ పెరగనున్న ధరలు!

Purushottham Vinay
ఇక భారత్ కొనుగోలు చేసే క్రూడాయిల్ బ్యారల్ ధర పదేళ్ల గరిష్ట స్థాయికి ఎగిసింది. ఒక్కో బ్యారల్ ధర వచ్చేసి 121 డాలర్లను దాటింది. ఒక దశలో ఇది 122.8 డాలర్లకు చేరినా  కూడా తర్వాత కొద్దిగా దిగొచ్చింది. 2012 ఫిబ్రవరి ఇంకా మార్చిలల్లో ఈ స్థాయిలో ధరలు నమోదవగా.. మరోసారి కూడా ఇక అదే రిపీట్‌ అయ్యింది. భారత్ కొనుగోలు చేసే క్రూడాయిల్ ధరలు బాగా పెరుగుతున్నప్పటికీ..ప్రస్తుతానికైతే చమురు కంపెనీలు ఆ రెట్లు పెంచడంలేదు. అయితే ఇంకెంత కాలం ఈ భారాన్ని ప్రజలపై మోపకుండా కంపెనీలు ఉంటాయన్నదే ఇప్పుడు డౌట్‌.మరోవైపు పెట్రోల్‌ ఇంకా డీజిల్‌ ధరలు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం సాహసించడం లేదు. ఇక అలా పెంచితే రిటైల్‌ ద్రవ్యోల్బణం మరింత కోరలు చాస్తుందని భయపడుతోంది. ఏప్రిల్‌ నెల రిటైల్‌ ద్రవ్యోల్బణం ఇప్పటికే ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయి 7.79 శాతానికి చేరింది. అలాగే అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా, దేశీయ మార్కెట్లో పెట్రో ధరలు కనుక పెంచితే రిటైల్‌ ద్రవ్యోల్బణం తొమ్మిది శాతానికి ఎగబాకుతుందనే అంచనాలు ప్రభుత్వాన్ని భయపెడుతున్నాయి. అయితే పెట్రోల్‌ ఇంకా డీజిల్‌పై నష్టాలను ఆయిల్‌ కంపెనీలు ఎంత కాలం భరించగలవన్నదే ఇప్పుడు ఇక్కడ అసలు ప్రశ్న.బ్రెంట్‌ క్రూడ్‌ ధర ఆకాశాన్నంటే రీతిలో పైపైకి దూసుకుపోవడానికి చాలా రకాల కారణాలున్నాయి. అలాగే రష్యా ముడిచమురు దిగుమతులపై నిషేధం విధించాలనే ప్రతిపాదనను యూరోపియన్ యూనియన్ సమర్థించడంతో క్రూడ్ ఆయిల్ ధరల్లో ఈ పెరుగుదల కనిపిస్తోంది.


ఇక బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారల్‌కు 120 డాలర్లు దాటడం కూడా ఆందోళన కలిగిస్తోంది. రష్యా-యుక్రెయిన్‌ యుద్ధంతో పాటు చైనాలో కరోనా మహమ్మారీ కారణంగా విధించిన లాక్‌డౌన్ ఆంక్షలు సడలింపు వంటి పరిణామాలు క్రూడ్ ఆయిల్‌పై ప్రభావం చూపాయి. చైనాలో లాక్‌డౌన్ సడలిస్తే అది ముడి చమురు డిమాండ్‌ను కూడా పెంచుతుంది.సరఫరా లేకపోవడంతో ధరలు మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. ఇక అటు మూలిగే నక్కమీద తాటికాయ పడినట్లు.. యుద్ధం ఇంకా చైనా లాక్‌డౌన్‌ ప్రభావంతో అసలే రోజు రోజుకీ చమురు ధరలు చుక్కలను తాకుతుంటే..తరువాత లిబియాలో వేల బ్యారెళ్ల చమురు ఎడారి పాలవడం కష్టాలను మరింత పెంచేలా కూడా చేసింది. ఇక లిబియాలో ఎంతోకిలకమైన భూగర్భ పైపులైన్ దెబ్బతిన్నడంతో క్రూడ్‌ ధరల పెరగడానికి మరో ప్రధాన కారణం. ఇక అమెరికాలో అయితే గ్యాసోలిన్‌ ధర గ్యాలన్‌కు ఏకంగా 5డాలర్లు పెరగడం కూడా క్రూడ్ మంటలకు కారణంగా తెలుస్తోంది.అటు ఇరాన్‌-అమెరికాల మధ్య న్యూక్లియర్‌ డీల్ కుదురుతుందా లేదా అన్న భయాలతో ఈ క్రూడ్‌ ధరలు పెరగినట్లు నిపుణులు చెబుతున్నారు. అటు ఒపెక్‌ దేశాల్లో క్రూడ్‌ ఆయిల్ ఉత్పత్తి కూడా తగ్గడంతో పాటు కరోనా లాక్‌డౌన్‌ దాదాపుగా అన్ని దేశాల్లో లిఫ్ట్‌ చేయడంతో ప్రజల వాహనాల వాడకం పెరగడం కూడా క్రూడ్‌ ధరలు పెరగడానికి మరో ప్రధాన కారణం కావొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: