మోడీ కొత్త ప్లాన్.. ప్రపంచ రికార్డుపై కన్ను?

praveen
ఇటీవలికాలంలో జాతీయ రహదారుల రూపురేఖలు మార్చేందుకు అటు కేంద్ర ప్రభుత్వం నడుంబిగించింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కోట్ల రూపాయల నిధులు కూడా విడుదల చేసింది. దీంతో ఇటీవల కాలంలో జాతీయ రహదారులు ఆధునీకరణ తో   అద్దంలా ముస్తాబవుతున్నాయ్. ఈ క్రమంలోనే జాతీయ రహదారుల నిర్మాణం లో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఏకంగా ప్రపంచ రికార్డు క్రియేట్ చేయబోతోంది  అని తెలుస్తోంది . గతంలో ఖాతార్ పేరిట ఉన్న రికార్డును తిరగరాసేందుకు భారత ప్రభుత్వం సిద్ధమైంది.

 ఈ క్రమంలోనే మహారాష్ట్రలో ఒక జాతీయ రహదారి నిర్మాణం మొదలు పెట్టబోతుంది అని తెలుస్తోంది. ఎక్కడైనా 110 గంటల్లో 75 కిలోమీటర్ల రోడ్డు ను నిర్మించేందుకు కేంద్రప్రభుత్వం అంతా సిద్ధం చేసుకుంది. ఇలా అత్యంత వేగంగా ఎక్కువ కిలోమీటర్లు రోడ్డు వేసిన  దేశంగా ఇప్పటివరకు ఖాతార్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేసిన భారత్ ప్రపంచ రికార్డు నెలకొల్పడానికి సిద్ధమైంది. అమరావతి- అకోలా రోడ్డు నిర్మాణం చేపట్ట పోతుంది.  అయితే రోడ్డు మొత్తం గుంతలు గుంతలు గా అద్వానంగా  ఉండడంతో గతంలోనే ఈ రోడ్డు నిర్మాణానికి కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చాయి.

 కానీ ఇక ఈ రోడ్డు నిర్మాణ పనుల్లో తరచూ అలసత్వం జరుగుతూ వచ్చింది.  ఈ క్రమంలోనే జూన్ 3 అంటే నేడు ఉదయం ఎనిమిది గంటలకు పనులు ప్రారంభించారు.. ఏడో తేదీనా సాయంత్రం లోపు ఇక ఈ 75 కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మాణాన్ని పూర్తి చేయబోతున్నారు. ఇక ఈ నిర్మాణ పనుల్లో ఏకంగా ఎనిమిది వందల మంది కార్మికులు పాల్గొనబోతున్నారు అన్నది తెలుస్తుంది. ఒకవేళ అనుకున్న సమయానికి కనుక జాతీయ రహదారి నిర్మాణం పూర్తి చేస్తే ఏకంగా గిన్నిస్ రికార్డు కొట్టడం ఖాయమని తెలుస్తోంది. ఇది సక్సెస్ అయితే భారత్లో ఇది ఒక అద్భుతం అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: