ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎందుకు పేలిపోతున్నాయంటే?

Purushottham Vinay
దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇంకా ఈ- మోటార్ సైకిళ్ల వినియోగాన్ని 2030 నాటికి 80శాతానికి చేర్చాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.ఇక దీనికి అనుగుణంగా ఎలక్ట్రిక్ వాహనానికి రిజిస్ట్రేషన్ ఫ్రీ, సబ్సిడీ వంటి అవకాశాలను కేంద్రం కల్పిస్తుంది. దీనికితోడు ఇటీవలి కాలంలో పెట్రోల్ ఇంకా డీజిల్ ధరలు భారీగా పెరగడంతో వాహనదారులు కూడా ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు సిద్ధమయ్యారు. పది మంది వాహనాలు కొనుగోలు చేస్తే అందులో ఇద్దరు నుంచి ముగ్గురు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు బాగా మొగ్గుచూపినట్లు గతంలో పలు సర్వేలు కూడా వెల్లడించాయి. అయితే ఈ ఎలక్ట్రిక్ వాహనాల్లో ఒక్కసారిగా మంటలు వ్యాపిస్తుండటంతో పాటు ఛార్జింగ్ సమయంలో కూడా బ్యాటరీలు పేలడం వంటి ఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు.ఇక దేశ వ్యాప్తంగా వరుసగా ఎలక్ట్రిక్ వాహనాల్లో మంటలు వ్యాపించి దగ్దమైన ఘటనలు చోటు చేసుకోవటంతో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు చాలా మందగించాయి. అయితే వేసవి కాలం కావడంతో వాహనాల్లో మంటలు వ్యాపిస్తున్నాయని అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. వరుసగా ఎలక్ట్రిక్ వాహనాల్లో మంటలు వ్యాపించి దగ్దమైన ఘటనలు చోటు చేసుకోవటంతో కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది.ఇక కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దర్యాప్తుకు ఆదేశించారు. 


భారత రక్షణ పరిశోధన సంస్థ (డీఆర్‌డీవో) రంగంలో దిగి ఎలక్ట్రిక్ వాహనాల్లో మంటలు ఎందుకు చెలరేగుతున్నాయనే అంశాలపై విచారణ చేపట్టింది. ఇక ఈ విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.ఇక అందరూ కూడా అనుకుంటున్నట్లు ఎలక్ట్రిక్ వాహనాలు దగ్దం కావడానికి వేసవి కాలం కారణం కాదని, ఆ బ్యాటరీలో లోపాల కారణంగానే వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని తన నివేదికలో పేర్కొన్నారు. బ్యాటరీ ప్యాక్స్ డిజైన్లు ఇంకా సరియైన నిర్ధారణ పరీక్షలు నిర్వహించకుండానే బ్యాటరీ బండ్లను కంపెనీలు మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయని ఇక అందుకే వాహనాల్లో మంటలు చెలరేగుతున్నాయని డీఆర్డీవో నివేదికలు స్పష్టం చేశారు.ఇక అంతేకాక ఖర్చు తగ్గించుకునేందుకు లో గ్రేడ్ మెటీరియల్ ను కూడా ఉద్దేశ పూర్వకంగానే ఉపయోగించడం కూడా ప్రమాదాలకు కారణమని డీఆర్డీవో నివేదిక స్పష్టం చేయడం జరిగింది. మరి కంపెనీల వైఖరి బయటపడటంతో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఏ విధంగా స్పందిస్తారో వెయిట్ చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: