హైదరాబాద్ : పవన్ కు అంత ధైర్యముందా ?

Vijayaఉమ్మడి నల్గొండ జిల్లాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ శుక్రవారం అంటే 20వ తేదీన పర్యటించబోతున్నారు. జిల్లాలోని చౌటుప్పల్, కోదాడల్లో పర్యటించబోతున్నారు. ప్రమాదాల్లో మరణించిన పార్టీ క్రియాశీలక  సభ్యుల కుటుంబసభ్యలను పరామర్శిచేందుకే పవన్ పర్యటన పెట్టుకున్నారు. కుటుంబసభ్యులకు రు. 5 లక్షల చెక్కులను పవన్ అందిస్తారు. ఇంతవరకు మంచి కార్యక్రమమే అనటంలో సందేహంలేదు. అయితే ఇదే సమయంలో పవన్ ఏమి మాట్లాడుతారన్నది కీలకమైంది.ఇదే విధమైన కార్యక్రమాన్ని ఏపీలో కూడా పెట్టుకున్నారు. పశ్చిమగోదావరి, అనంతపురం, కర్నూలులో తిరిగిన పవన్ రాష్ట్రప్రభుత్వం+జగన్మోహన్ రెడ్డిపై నోటికొచ్చినట్లు మాట్లాడారు. సంబంధంలేని అంశాలను కూడా జగన్ కు ముడేసేసి బురదచల్లేశారు. రేపటి ఎన్నికల్లో ఎలాగైనా ముఖ్యమంత్రి అయిపోవాలన్న ఆతృతలో ఉన్నారు కాబట్టి రాజకీయ పర్యటనలు, రాజకీయ స్పీచులనే పవన్ దంచేస్తున్నారు. షెడ్యూల్ ఎన్నికలకు ఇంకా రెండేళ్ళున్న సంగతి గుర్తుంచుకోవాలి.మరి తెలంగాణాలో ఎన్నికలు వచ్చే ఏడాదే జరగబోతున్నాయి. ఇక్కడ కూడా జనసేన అభ్యర్ధులను పోటీచేయించే ఆలోచనలో పవన్ ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరి పవన్ ఆలోచనలు ఎంతవరకు వర్కవుటవుతుందో తెలీదు. ఎందుకంటే ఏపీలో జగన్ పై ఒంటికాలిమీద లేచి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న పవన్ కు తెలంగాణాలో కేసీయార్ పై మాట్లాడాలంటే అసలు నోరే లేవటంలేదు. ఏపీలో బీజేపీ మిత్రపక్షమే కానీ తెలంగాణాలో కాదు.అంటే టెక్నికల్ గా చూస్తే తెలంగాణాలో జనసేనకు అన్నీపార్టీలు ప్రత్యర్ధులే అని అర్ధమైపోతోంది. అయినా టీఆర్ఎస్ పైనకానీ బీజేపీ పైనకానీ పవన్ కు నోరు లేవటంలేదు. అధికారపార్టీపై మాట్లాడలేక, ప్రతిపక్షాలపైనా మాట్లాడలేక ఇక పవన్ ఎవరి గురించి మాట్లాడుతారు ? ఎవరిమీదా ఏమీ మాట్లాడలేక, ప్రభుత్వంపై ఆరోపణలు, విమర్శలు చేయటానికే భయపడుతున్న పవన్ ఇక తెలంగాణాలో రాజకీయమేమి చేస్తారు ? రేపటి ఎన్నికల్లో ఇంకేమి పోటీచేస్తారు ? ఒకవేళ పోటీచేసినా జనాలకు ఏమని చెబుతారు ? ఇవన్నీ చూస్తుంటే పవన్ రాజకీయంగా స్పీచులిచ్చేంత ధైర్యం ఉన్నట్లు అనిపించటంలేదు. మరి రేపటి పర్యటనలో ఏమి మాట్లాడుతారో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: