గుడ్ న్యూస్.. 95 శాతం స్థానికులకే ఉద్యోగాలు?

praveen
సింగరేణి ప్రాంతాల్లో ఉండే నిరుద్యోగులు అందరికీ ఇటీవలే డీపీఆర్ పాలకమండలి శుభ వార్త చెప్పింది. సింగరేణిలో మరోసారి ధర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించింది. 800 మెగావాట్ల సామర్థ్యంతో  థర్మల్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు కోసం ఇక ఇటీవల జరిగిన సమావేశంలో డీపీఆర్ పాలక మండలి ఆమోదం తెలపడం గమనార్హం. హైదరాబాద్ వేదికగా డి పి ఆర్ పాలకమండలి సమావేశం జరిగింది. ఇక ఈ సమావేశంలో భాగంగా థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు గురించి చర్చించి ఆమోదం తెలిపారు.  ఇక ఈ సమావేశంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సింగరేణిలో 95 శాతం ఉద్యోగాలు స్థానిక జిల్లాల వారికి ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దీంతో ఇక అందరూ ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్కేంద్రం మంచిర్యాల జిల్లాలోని జైపూర్ వద్ద ఏర్పాటు చేయాలని నిర్ణయించారు అని చెప్పాలి.

 కాగా మంచిర్యాల జిల్లాలోని జైపూర్ లో ఇప్పటికే 1200 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్ ఉండడం గమనార్హం. ఇక ఈ విద్యుత్ ప్లాంటు ఉన్న ప్రాంగణంలోనే కొత్తగా థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.  ప్రస్తుతం ఇక కొత్తగా నిర్మించబోయే థర్మల్ విద్యుత్ కేంద్రం కోసం 6790 కోట్లు నిధులు  అవసరం ఉంటుందని పాలక మండలి అంచనా వేసింది. ఇక దీంతోపాటు ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ తో కలిసి మందమర్రి వద్ద మరో 50 వేల టన్నుల పేలుడు పదార్థాల ఉత్పత్తి కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించడం గమనార్హం.

 ఇప్పటికే ఆ ప్రాంతంలో 50 వేల టన్నుల పేలుడు పదార్థాల ఉత్పత్తి కేంద్రాలు అందుబాటులో ఉన్నాయ్ అని చెప్పాలి. దీని సామర్థ్యాన్ని
 ఇప్పుడు లక్షకు పెంచాలని డీపీఆర్ పాలకమండలి నిర్ణయించింది. ఏదేమైనా సింగరేణిలో 95 శాతం ఉద్యోగాలు స్థానిక జిల్లాల వారికి ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడంపై స్థానిక ప్రజలు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఎంతోమంది నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: