అమరావతి ఉద్యమం పై సినిమా.... ఎంత వరకు నిజం?

VAMSI
అమరావతి ఉద్యమం మొదలై ఇప్పటికే 200 రోజుల పైగా గడుస్తోంది. అయిన ఈ ఉద్యమం ఏమాత్రం సన్నగిల్లలేదు సరికాదు రోజురోజుకు ఇంకా తీవ్రతను పెంచుతూ మరింత దృఢంగా తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు అమరావతి వాసులు.  ఈ ఉద్యమం పై సినిమా తీయాలని గత కొద్ది రోజులుగా చర్చ నడుస్తోండగ ఇటీవలే సినిమా తీయడానికి రంగం సిద్దమయింది.
 అమరావతి ఉద్యమం పై సినిమా తీయబోతున్నట్లు అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఒక కొత్త అప్డేట్ వచ్చింది. ఇటీవలే అమరావతి ఉద్యమం పై తీయబోయే చిత్రం లో కొందరి నటీనటులను ఫైనల్ చేసినట్లు సమాచారం అందగా...ఇపుడు  షూటింగ్ కూడా మొదలైనట్లు టాక్ వినిపిస్తోంది  ఈ సినిమాకి రాజదాని జే ఏసీ సహకారం తో రవిశంకర్ నిర్మాతగా వ్యవహరిస్తుండగా...నరేంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.  హీరో నిఖిల్, సీనియర్ యాక్టర్ లు వాని విశ్వనాథ్, వినోద్ కుమార్ తదితురుల పై సన్నివేశాలు కూడా చిత్రీకరించినట్లు సమాచారం.   ఉద్యమం లో పాల్గొన్న మలువురు మహిళలు  ఈ సినిమాలో సహాయక నటులుగా చేస్తున్నారు. ఒక క్లీన్ పిక్చర్ తో ఈ చిత్రాన్ని ముందుకు తీసుకు వెళుతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమా షూటింగ్ ను పూర్తిగా అనంతపూర్ జిల్లా పరిధిలోనే పూర్తి చేయాలని అనుకుంటున్నారట.
అందుకు తగిన లోకేషన్లు సిద్దం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒకటి రెండు తప్ప మిగిలిన సన్నివేశాలన్నీ యదావిధిగా వాస్తవ ఉద్యమం కొనసాగుతున్న సమయం లోనే చిత్రీకరణ చేయాలని చిత్ర బృందం యోచిస్తున్నట్లు సమాచారం. ఏపిలో అమరావతి ఉద్యమం ప్రారంభం అయినప్పటి నుండి హైకోర్టు తీర్పు, ఇపుడు ప్రస్తుత ఉద్యమ పరిస్థితి వరకు జరిగిన అన్ని ప్రధాన ఘటనల ను ఈ చిత్రం లో చూపించబోతున్నట్లు చెబుతున్నారు.మరి ఇందులో ఎంత వరకు నిజం చూపించబోతున్నారు అనేది వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: