ఇదిగో.. జగన్ కొత్త మంత్రుల జాబితా?

Chakravarthi Kalyan
జగన్.. తన మంత్రి వర్గాన్ని మారుస్తానని ఇప్పటికే చెప్పేశారు. అసలు సీఎం పీఠం ఎక్కిన మొదట్లోనే ఈ విషయంపై మంత్రులకు క్లారిటీ ఇచ్చేశారు. దీనిపై ఊహాగాలు వస్తున్న వేళ.. మొన్న వైసీపీఎల్పీ మీటింగ్‌లోనూ క్లారిటీ ఇచ్చేశారు. మంత్రి వర్గం నుండి తొలగించిన వారికి పార్టీ బాధ్యతలు, జిల్లా అధ్యక్ష పదవులు, రీజినల్ కో ఆర్డినేటర్ బాధ్యతలు అప్పగిస్తానని కూడా జగన్ హామీ ఇచ్చారు. మంత్రి పదవి నుంచి తీసేశానని బాధవద్దని.. పార్టీ కోసం కష్టపడుతూ మీరు గెలిచి, పార్టీని గెలిపించుకుని రావాలని జగన్ సూచించారు. అలా చేస్తే మళ్లీ మీకే మరోసారి అవకాశాలు వస్తాయని మంత్రి పదవులు కోల్పోయే వారికి ఊరటగా చెప్పారు.

అయితే.. మరి జగన్ కొత్త మంత్రివర్గంలో చోటు ఎవరికి దక్కుతుంది.. ఎవరినీ రెండోసారి కూడా మంత్రి వర్గంలోకి తీసుకుంటారు.. అనే అంశాలపై బాగా ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో జగన్ కొత్త మంత్రివర్గంలో చోటుదక్కేది వీరికే అంటూ కొందరు ఎమ్మెల్యేల పేర్లతో ఓ లిస్ట్ వైరల్ అవుతోంది. సామాజిక వర్గాల వారిగా కొత్తగా మంత్రి పదవులు దక్కే అవకాశాలున్న ఎమ్మెల్యేల జాబితా  సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఈ జాబితా ప్రకారం.. మంత్రులుగా కొనసాగేవారిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్ర రెడ్డి, కొడాలి నాని , పేర్ని నాని ఉన్నారు. ఇక సామాజికవర్గాల వారిగా మంత్రిపదవులు దక్కే అవకాశమున్నవారిలో ఎస్టీ నుంచి పెడిక రాజన్న దొర, తెల్లం బాలరాజు, కొట్టు భాగ్యలక్ష్మి, చెట్టి పాల్గుణ ఉన్నారు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి పండుల రవీంద్ర బాబు, గొల్ల బాబురావు, తలారి వెంకట్రావు, మేరుగు నాగార్జున, వరప్రసాద రావు, కోరుముట్ల శ్రీనివాస్, తోగురు అర్థర్ ఉన్నారు.

కాపు సామాజిక వర్గం నుంచి దాడిశెట్టి రాజా, జక్కంపూడి రాజా, గ్రంధి శ్రీనివాస్, సామినేని ఉదయభాను, అంబటి రాంబాబు, తోట త్రిమూర్తులు ఉన్నారు. బీసీ సామాజిక వర్గం నుంచి కొలుసు పార్థసారథి, ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం, జోగి రమేష్, పొన్నాడ సతీష్, కారుమూరి వెంకట రమణ నాగేశ్వరావు ఉన్నారు. మైనార్టీ సామాజిక వర్గం నుంచి హాఫీజ్ ఖాన్, రుహుల్ల ఉండగా.. క్షత్రియ సామాజిక వర్గం నుంచి ముదునూరి ప్రసాద్ రాజుకు అవకాశం ఉంది. మహిళల నుంచి 1) రెడ్డి శాంతి, 2) ఆర్ కే రోజా రెడ్డి, 3)విడుదల రజిని, 4)జొన్నలగడ్డ పద్మావతి, 5)విశ్వాసరాయి కళావతి, 6)ఉషశ్రీ శరణ్, 7మేకపాటి లత ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గం నుంచి 1)ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, 2)గండికోట శ్రీకాంత్ రెడ్డి, 3)నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి,4)భూమన కరుణాకర్ రెడ్డి, 5)కాకాని గోవర్ధన్ రెడ్డి, 6)కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, 7)అనంత వెంకట రామిరెడ్డి, 8)తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, 9)చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, 10)ఆళ్ల రామకృష్ణారెడ్డి, 11)పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, 12)రాంభూపాల్ రెడ్డి ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: