కమ్మ ‘ఫ్యాన్స్’కు ఈ సారి కష్టమే?

M N Amaleswara rao
కమ్మ వర్గం అంటే ఏదో తెలుగుదేశం పార్టీకే మద్ధతు ఇచ్చే వర్గమని అంతా అనుకుంటారు...అసలు టీడీపీ అంటేనే కమ్మ నేతలు హవా ఉండే పార్టీ అని భావిస్తారు...అయితే టీడీపీలోనే కాదు కమ్మ నేతలు వైసీపీలో కూడా ఉన్నారనే సంగతి తెలిసిందే..వైసీపీలో కమ్మ వర్గం నేతలు కాస్త ఎక్కువగానే ఉన్నారు కూడా...అలాగే ఆ పార్టీలో ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఉన్నారు..వినుకొండలో బొల్లా బ్రహ్మనాయుడు, తెనాలిలో అన్నాబత్తుని శివకుమార్, పెదకూరపాడులో నంబూరు శంకర్ రావు, మైలవరంలో వసంత కృష్ణప్రసాద్, దెందులూరులో అబ్బయ్య చౌదరీ ఉండగా, గుడివాడలో మంత్రి కొడాలి నాని ఉన్న విషయం తెలిసిందే.


ఇక నరసారావుపేట ఎంపీగా శ్రీకృష్ణదేవరాయలు, విశాఖపట్నం ఎంపీగా ఎం‌వి‌వి సత్యనారాయణ ఉన్నారు...అలాగే టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన వల్లభనేని వంశీ, కరణం బలరాం ఉన్నారు..వీరు కమ్మ నేతలే. వీరే కాదు ఇంకా పలు నియోకవర్గాల బాధ్యతలు కమ్మ నేతలే చూసుకుంటున్నారు. పర్చూరులో రావి రామనాథం బాబు, అద్దంకిలో బాచిన చైతన్యకృష్ణ, విజయవాడ ఈస్ట్ లో దేవినేని అవినాష్ ఉన్నారు. ఇలా వైసీపీలో కమ్మ వర్గం నేతలు ఎక్కువగానే ఉన్నారు.
అయితే వీరు జగన్ ని ఎక్కువ అభిమానిస్తారు...అందుకే వైసీపీకి కీలకంగా పనిచేస్తున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో ఈ కమ్మ నేతలు సత్తా చాటాలని చూస్తున్నారు..ఇప్పుడు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఉన్నవారు మరొకసారి గెలవాలని చూస్తుండగా, అటు మిగిలిన నేతలు కూడా గెలవాలని అనుకుంటున్నారు.
కానీ ఈ సారి కమ్మ ఫ్యాన్స్ కు గెలుపు అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి..ఉన్నవారిలో కొడాలి నాని, వల్లభనేని వంశీ, కరణం బలరామ్, దేవినేని అవినాష్ మినహ...మిగిలిన వారికి కాస్త గెలుపు కష్టమయ్యేలా ఉంది...వీరిలో కూడా గెలుపు కొందరికి కష్టం అవ్వోచ్చు..కాబట్టి ఈ సారి మాత్రం వైసీపీలో ఉన్న కమ్మ నేతలు ఎక్కువ డేంజర్ జోన్లో ఉన్నారని చెప్పొచ్చు...ఇక ఈ కమ్మ నేతలకు టీడీపీ నుంచి కమ్మ నేతలే చెక్ పెట్టేలా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: