జోగికి బెర్త్ ఫిక్స్ అవట్లేదా?

M N Amaleswara rao
మంత్రి పదవి కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న వారిలో పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ కూడా ఒకరని చెప్పొచ్చు...మొదట నుంచి ఈయన మంత్రి పదవిపై ఆశలు పెట్టుకుని ఉన్నారు...కాకపోతే మొదట్లో ఈయనకు మంత్రి పదవి దక్కలేదు..అయితే ఈ సారి ఎలాగైనా మంత్రి పదవి దక్కించుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు...జగన్ దృష్టిలో పడటానికి జోగి ఎలాంటి కార్యక్రమాలు చేశారో అందరికీ తెలిసిందే...చంద్రబాబుపై విమర్శలు చేయడం, అసెంబ్లీ వేదికగా బాబు, రఘురామలని తిట్టడం, అలాగే చంద్రబాబు ఇంటిపై మనషులని వేసుకుని వెళ్ళి రచ్చ చేయడం...ఇలా అనేక కార్యక్రమాలు చేశారు.
మరి ఏమైందో తెలియదు గాని ఈ మధ్య జోగి హడావిడి కనిపించడం లేదు...ఇటీవల కాలంలో కాస్త సైలెంట్ అయినట్లు ఉన్నారు...అంటే మంత్రి పదవి రాదని హింట్ వచ్చి సైలెంట్ అయ్యారా? లేక కొన్ని రోజులు ఆగి మళ్ళీ పోలిటికల్ స్క్రీన్‌పై హడావిడి చేయాలని చూస్తున్నారో తెలియదు గాని..జోగి ఇటీవల కాలంలో మాత్రం వెనక్కి తగ్గారు. పైగా ఆ మధ్య తన సొంత నియోజకవర్గంలో జరిగిన పెడన జెడ్పీటీసీ స్థానంలో వైసీపీ ఓడిపోయింది. అనూహ్యంగా అక్కడ టీడీపీ గెలిచింది. అలాగే జోగి సొంత నియోజకవర్గమైన మైలవరం మున్సిపాలిటీలో వైసీపీ ఓడిపోయింది. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, జోగి రమేష్ కలిసి పనిచేసిన సరే...మైలవరంలో టీడీపీ గెలుపు ఆపలేకపోయారు. ముఖ్యంగా జోగి రమేష్ సోదరుడు కూడా పోటీ చేసి ఓడిపోయారు.


ఈ ఓటముల తర్వాత జోగి కాస్త మీడియాలో కనిపించడం తగ్గింది..హడావిడిగా మీడియా సమావేశం పెట్టేసి..చంద్రబాబుపై విమర్శలు చేసే కార్యక్రమాలు చేయడం లేదు. అంటే మంత్రి పదవి దక్కదనే సైలెంట్ అయ్యారనే చర్చ కృష్ణా జిల్లాలో నడుస్తోంది. అయితే గౌడ కోటా కింద పదవి దక్కించుకోవాలని చూస్తున్నారు...కానీ ఆయనకు అంత ఈజీగా మాత్రం పదవి దక్కేలా కనిపించడం లేదు. మొత్తానికి జోగి రమేష్‌కి జగన్ క్యాబినెట్‌లో బెర్త్ ఫిక్స్ అయ్యేలా కనిపించడం లేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: