కేసీఆర్ మదనపడుతున్నారా.. పీకే ఎంట్రీ ఇందుకేనా..!

MOHAN BABU
తెలంగాణ లో కేసిఆర్,పీకే భేటీ హాట్ టాపిక్ గా మారింది. వీరి భేటీలో ముందస్తు పైన చర్చ జరిగిందా? లేక  దేశ రాజకీయాలు టార్గెట్ అయ్యాయా..? ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ సీఎం కెసిఆర్ ప్రశాంత్ కిషోర్  ను వ్యూహకర్తగా నియమించుకోవడమే చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే ఆయన రాజకీయ సలహాలు ఇతరుల నుంచి తీసుకుంటారని ఎవరూ అనుకోలేదు. కొద్దిరోజులుగా కెసిఆర్ పీకే వ్యూహాల ప్రకారం రాజకీయాలు చేస్తున్నారని విశ్లేషణలు వస్తున్నప్పటికీ టిఆర్ఎస్ వర్గాలు కూడా ఖచ్చితంగా నిజమని నమ్మలేకపోయాయి. గత రెండు రోజులుగా పీకే ఫామ్ హౌస్

 లోనే కెసిఆర్ తో సుదీర్ఘ   చర్చలు జరిపారని స్పష్టత రావడంతో నమ్ముతున్నారు. సినిమాలలో రాజమౌళి లాంటి ట్రాక్ రికార్డు ను రాజకీయ వ్యూహకర్తగా తెచ్చుకున్న ప్రశాంత్ కిషోర్ మరోసారి టిఆర్ఎస్ ను కెసిఆర్ ను ఉన్నత స్థానానికి తీసుకెళ్తారని  నమ్ముతున్నారు. ప్రశాంత్ కిషోర్ సలహాలతో కెసిఆర్ దేశ రాజకీయాలపై దృష్టి పెట్టారని ఎక్కువమంది నమ్ముతున్నారు. ఆయన సలహా తోనే కేంద్రంపై కేసీఆర్ విరుచుకు పడుతున్నారని అనుకుంటున్నారు. అయితే బిజెపి పై విరుచుకు పడడంలో దీర్ఘకాలంలో జాతీయ రాజకీయాల కోణం ఉన్నా కెసిఆర్ తక్షణ కర్తవ్యం రాష్ట్ర రాజకీయాలే. తెలంగాణ ఢిల్లీ సీఎం బిజెపిని గురిపెట్టి గల్లీ అధికారాన్ని టార్గెట్ చేశారనేది ఎక్కువ మంది అభిప్రాయం. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు 2024లో వస్తాయి  అంతకంటే ముందే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. అంటే పార్లమెంట్ ఎన్నికలకు ఆరు నెలల ముందే అసెంబ్లీ ఎన్నికలు ముగుస్తాయి. కెసిఆర్ ముందస్తుగా వెళ్లినా, వెళ్లకపోయినా పార్లమెంట్ కన్నా ముందే అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తేనే పార్లమెంట్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు

 వస్తాయి.కానీ జాతీయ రాజకీయాల కన్నా కేసిఆర్ ఆలోచన చేయాల్సింది రాష్ట్ర రాజకీయాల గురించే. ఈ విషయంలో రాజకీయ ఉద్దండువు అయిన కేసీఆర్ కు క్లారిటీ లేదని ఎవరూ అనుకోలేదు. అందుకే బయటకు కెసిఆర్ బిజెపిని టార్గెట్ చేసినా, అదేపనిగా జాతీయ రాజకీయాల గురించి మాట్లాడినా అంతిమ లక్ష్యం మాత్రం రాష్ట్ర రాజకీయాలే. ప్రశాంత్ కిషోర్ ఇప్పటికిప్పుడు కేసీఆర్ కు పనిచేసినా అది రాష్ట్రంలో అధికారంలోకి రావడానికేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: