సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ లేఖ... టార్గెట్ అదే?

VAMSI

నిన్న కేసీఆర్ పుట్టిన రోజు జరుపుకున్న విషయం తెలిసిందే. అయినా నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ధర్నాలు నిరసనలు వ్యక్తం చేశారు. నేటికీ కొన్ని చోట్ల ధర్నాలు జరుగుతాయని నిన్న కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. కాగా నేడు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కేసీఆర్ ను ఉద్దేశించి ఒక బహిరంగ లేఖను రాయడం సంచలనంగా మారింది. కొద్ది రోజుల నుండి బీజేపీ మరియు తెరాస పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి అని కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలకు ఈ లెటర్ తో తెరపడింది అని చెప్పాలి. అయితే ఇంతకీ ఆ లెటర్ లో ఏముంది అనేది ఒకసారి చూద్దాం.
ఈ లేఖలో బండి సంజయ్ దేశానికి వెన్నెముక అయిన గ్రామాల గురించి క్లియర్ గా వివరించారు. దేశ అభివృద్ధికి గ్రామాలు మూల కారణం అని, గ్రామాల అభివృద్ధికి ఎందుకు వెనుకడుగు వేస్తున్నారు అంటూ కేసీఆర్ ను ప్రశ్నించారు. అయితే గ్రామ అభివృద్ధి లో గ్రామ పంచాయితీ కార్యదర్శులు ప్రముఖ పాత్ర పోషిస్తారు అని చెబుతూనే వారి పే స్కేల్ ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మరియు గ్రామ పంచాయితీ కార్యదర్శి యొక్క సర్వీస్ విషయంలోనూ ఒక నిర్ణయం తీసుకోవాలని ఈ లేఖలో పేర్కొన్నారు. గ్రామాలు పచ్చగా ఉండాలంటే చాలా విషయాలలో జాగ్రత్తగా వ్యవహరించాలని, అటువంటి వాటిలో ముఖ్యంగా గ్రామాల పారిశుధ్యం, హరితహరం, దోమల నివారణ మరియు పన్నుల సేకరణ లాంటి ఎన్నో అంశాలను సక్రమంగా చూసుకుంటూ ముందుకు వెళుతున్నారని పంచాయితీ కార్యదర్శుల పట్ల హర్షం వ్యక్తం చేశారు.
ఇలా ఎంత కష్టం అయినా బాధ్యతలను నిర్వర్తిస్తూ వెళుతుంటే వీరిపై అధికార పార్టీ ఒత్తిడి ఎక్కువ అవుతోందని లేఖలో రాశారు. ఇంకా ప్రభుత్వ అధికారుల నుండి కూడా వీరికి వేధింపులు ఉన్నాయని కేసీఆర్ సృష్టికి లేఖ ద్వారా పలు సమస్యలను తీసుకెళ్లారు. సత్వరమే పంచాయితీ కార్యదర్శుల పట్ల కాస్తంత దయ చూపి వారికి ఎటువంటి ఇబ్బందులు, సమస్యలు కలుగకుండా అన్ని విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలని లెటర్ లో తెలిపారు. మరి ఈ లెటర్ గురించి కేసీఆర్ ఏ విధంగా రిప్లై ఇస్తారు అన్నది తెలియాలంటే కొంత సమయం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: