అలా హెలికాప్టర్‌లో మేడారం వెళ్లొద్దామా..?

Chakravarthi Kalyan
మేడారం జాతర సందడి మొదలైంది.. ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన జాతరల్లో ఇది ఒకటి.. విపరీతమైన రద్దీ కారణంగా మేడారం చేరుకోవాలంటే ఇప్పుడు చాలా కష్టం.. అందుకే ఇప్పుడు ప్రభుత్వం మేడారం వెళ్లేందుకు హెలికాప్టర్ సేవలను కూడా అందుబాటులోకి తెచ్చింది. మేడారంలో రేపట్నుంచి హెలికాప్టర్‌ సేవలు అందుబాటులోకి వస్తాయి.

హనుమకొండ నుంచి  మేడారం వెళ్లేందుకు అందుబాటులోకి హెలికాప్టర్‌ సేవలు రాబోతున్నాయి. హనుమకొండ నుంచి మేడారం వెళ్లి రావడానికి ఒక్కొక్కరికి రూ.19,999 ఛార్జీ వసూలు చేయనున్నారు. మేడారంలో జాయ్‌ రైడ్‌కు టికెట్‌ ధర రూ.3,700గా నిర్ణయించారు. ఈ హెలికాప్టర్లను బెంగళూరుకు చెందిన తుంబి ఏవియేషన్స్‌ సంస్థ నడపబోతోంది. ఈ టికెట్లు ముందుగా బుక్‌ చేసుకోవాలనుకునేవారు 9400399999, 9880505905 నంబర్లకు ఫోన్‌ చేయొచ్చు. అలాగే info@helitaxii.comలో కూడా టికెట్లు అందుబాటులో ఉంటాయి. ఒక్కో ట్రిప్పులో ఆరుగురు వరకూ మేడారం వెళ్లొచ్చు.

ఇప్పటికే మేడారం వెళ్లలేని వారి కోసం తెలంగాణ ఆర్టీసీ కూడా సేవలు అందిస్తోంది.  కొందరు భక్తులు మేడారం వెళ్లలేకపోవచ్చు. అలాంటి వారి కోసం ఆర్టీసీ కొన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పుడు సమ్మక్క ప్రసాదాన్ని వారు కోరితే ఇంటికే తెచ్చి అందిస్తున్నారు. మేడారం ప్రసాదాన్నిడోర్‌ డెలివరీ చేస్తున్నారు. ఆర్టీసీ, తపాలా, ఐటీశాఖలతో ఈ డోర్ డెలివరీ చేస్తున్నారు. ఇవాళ్టి నుంచి 22 వరకు ఆన్‌లైన్‌ ద్వారా ఇంటికే ప్రసాదం సేవలు మేడారం భక్తులు అందుకోవచ్చు.

అంతే కాదు.. సమ్మక్క సారలమ్మలకు బెల్లం కానుకలు కూడా ఆర్టీసీ ద్వారానే పంపొచ్చు. భక్తులు బెల్లాన్ని ఇంటి నుంచే బంగారం అమ్మవారికి పంపొచ్చు. ఇందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. ఆర్టీసీ వారు మీ ఇంటికి వచ్చి ప్రసాదం తీసుకెళ్తారు. మీ బంగారం అమ్మవారికి మీ తరపున సమర్పిస్తారు. అందులో కొంత భాగం ప్రసాదంగా మళ్లీ భక్తులకు ఇస్తారు. మీ సేవ ద్వారా కానీ.. టీయాప్ ఫోలియో ద్వారా భక్తులు ఈ సౌకర్యాన్ని బుక్ చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: