యూపీ ఎన్నికలు: జీ న్యూస్‌ సర్వేలో షాకింగ్‌ ఫలితాలు..?

Chakravarthi Kalyan
ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలకు ఇంకా కొన్నిరోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో అక్కడి రాజకీయ పరిస్థితి ఆసక్తికరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ మీడియా సంస్థ జీ న్యూస్ దేశంలోనే అతిపెద్ద ఒపీనియన్ పోల్‌ను నిర్వహించింది. ఉత్తరప్రదేశ్‌ను ఆరు ప్రాంతాలుగా విభజించి అతి పెద్ద సర్వే నిర్వహించింది. పూర్వాంచల్, అవధ్, బుందేల్‌ఖండ్, పశ్చిమ యుపి, సెంట్రల్ యుపి,  రోహిల్‌ఖండ్ ప్రాంతాల వారీ సరే ఈ సర్వే నిర్వహించారు.

ఈ సర్వే ప్రకారం మళ్లీ యూపీలో బీజేపీయే అధికారంలోకి వస్తుందట.. శుక్రవారం నిర్వహించిన జీ న్యూస్ ఒపీనియన్ పోల్‌లో బీజేపీ 241-263 సీట్లు గెలుచుకుంటుందని తేలిందట. అంటే  మెజారిటీ మార్కుకు కనీసం 40 సీట్లు ఎక్కువ వస్తాయట. అయితే.. ఈ సర్వే కంటే ముందు 2022 జనవరి 19న నిర్వహించిన పోల్‌లో బీజేపీకి 245-267 సీట్లు వస్తాయని జీన్యూస్‌ సర్వే అంచనా వేసింది. అంతే కాదు.. యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రి ఎంపికయ్యారు.

తాజా సర్వే ప్రకారం బీజేపీకి యూపీలో 41% ఓట్లు లభిస్తాయని అంచనా. రెండో స్థానంలో ఎస్పీ నిలిచింది.. మిగిలిన వాటిలో బీఎస్పీకి 12 శాతం, కాంగ్రెస్‌కు 6 శాతం ఓట్లు రావచ్చని సర్వే అంచనా వేసింది. ఇక శాతాల్లో కాకుండా సీట్ల లెక్కలు చూసుకుంటే.. ఈ ఒపీనియన్‌ పోల్‌లో బీజేపీకి 245-267 సీట్లు వస్తాయని అంచనా వేశారు. మిగిలిన పార్టీల విషయానికి వస్తే. ఎస్పీ 130-151 సీట్లు, బీఎస్పీ 4-9 సీట్లు, కాంగ్రెస్‌కు 3-7 సీట్లు మాత్రమే గెలుచుకుంటాయని అంచనా వేశారు.

ఈ ఒపీనియన్ పోల్ ప్రకారం యోగి ఆదిత్యనాథ్ 47% ఓట్లతో మోస్ట్ ఫేవరెట్ ముఖ్యమంత్రిగా నిలిచారు. ఆ తర్వాత స్థానంలో అఖిలేష్ యాదవ్ 34% ఓట్లతో రెండో బెస్ట్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. అంతకుముందు 19 జనవరి 2022న నిర్వహించిన ఒపీనియన్ పోల్‌లో కూడా  యోగి ఆదిత్యనాథ్ అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రిగా నిలిచారు. సో.. మొత్తం మీద.. జీ న్యూస్‌ ఒపీనియన్‌ పోల్ ప్రకారం.. యూపీలో మళ్లీ బీజేపీ అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: