ఇంగ్లీష్ మీడియం విద్య పై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన !

Veldandi Saikiran
ప్రతి పక్ష పార్టీల పై  సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ ఆర్థిక శాక, వైద్య శాఖ మంత్రి హరీశ్ రావు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తెస్తున్నాం అంటే.. బిజెపి నేతలకు ఎందుకు ఏడుపు అన్నారు మంత్రి హరీశ్ రావు. తెలంగాణ పేద బిడ్డలు ఇంగ్లీష్ మీడయంలో చదువుకోవద్దా.. అని నిలదీశారు మంత్రి హరీశ్ రావు. కార్పొరేట్ బుద్దిని బిజెపి మరో సారి బయట పెట్టుకున్నది. వారికి తలొగ్గి విమర్శలు చేస్తున్నదని స్పష్టం చేశారు మంత్రి హరీశ్ రావు. ఉద్యోగాలు ఇస్తం అంటే కోర్టుల్లో కేసులు వేస్తారు.. పేదలకు ఇంగ్లీష్ మీడియం విద్యను ఉచితంగా అందిస్తాం అంటే విమర్శలు చేస్తరని మండి పడ్డారు మంత్రి హరీశ్ రావు. దున్నపోతు ఈనిందంటే దూడను దొడ్లో కట్టేయమన్నట్లుంది బిజెపి కాంగ్రెస్ తీరు అంటూ ఓ రేంజ్‌ లో రెచ్చి పోయారు తెలంగాణ ఆర్థిక శాక, వైద్య శాఖ  మంత్రి హరీశ్ రావు. 

రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటిస్తే... అది సాధ్యం కాదు.. అయితే టి ఆర్ ఎస్ తరుపున ప్రచారం చేస్తా అని నాటి కాంగ్రెస్ ప్రతిపక్ష నేత జానారెడ్డి అన్నడని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి హరీశ్ రావు.. అన్నమాట ప్రకారం ఉచిత కరెంట్ ఇచ్చాము. మిషన్ భగీరథ తో నీళ్ళు ఇచ్చి చుపెట్టామని స్పష్టం చేశారు మంత్రి హరీశ్ రావు.రేపు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విద్యను ప్రారంభించి దేశానికే తెలంగాణ విద్యా విధానాన్ని ఆదర్శంగా నిలపబోతున్నామని ప్రకటన చేశారు తెలంగాణ ఆర్థిక శాక, వైద్య శాఖ  మంత్రి హరీశ్ రావు.  బీజేపీ పార్టీ మరియు కాంగ్రెస్‌ పార్టీలవి అన్ని జూట మాటలేనని నిప్పులు చెరిగారు తెలంగాణ ఆర్థిక శాక, వైద్య శాఖ మంత్రి హరీష్‌ రావు. ప్రజలు ఎవరూ కూడా  బీజేపీ పార్టీ మరియు కాంగ్రెస్‌ పార్టీల జూట మాటలు నమ్మ వద్దని..  వాటిని నమ్మి అస్సలు మోస పోకూడదని ప్రజలను కోరారు హరీష్‌ రావు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: