ధరణి పై తెలంగాణ కాంగ్రెస్ సంచలన నిర్ణయం ?

Veldandi Saikiran
పీసీసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి నేతృత్వంలో ధరణి వల్ల ప్రజల కష్టాలపై చర్చ జరిగిందని.. ధరణి వల్ల లక్షలాది మంది యజమానులు రికార్డులు పట్టుకొని బిచ్చగాళ్ల లాగా ఎమ్మార్వో ఆఫీస్ ల ముందు తిరుగుతున్నారని పేర్కొన్నారు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్.  భూ సర్వే చేసి..రికార్డుల సవరణ చేయాల్సింది..ప్రభుత్వం అనాలోచితంగా ధరణి ని తీసుకొచ్చిందన్నారు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్,ఎక్స్ సర్వీస్ మెన్ తమ భూమికి కూడా వాళ్ళు ఓనర్లుకాదని ధరణి చూపుతుంది...అనేక సర్వే నంబర్లు మిస్సయ్యాయి..మ్యుటేషన్ పోయిందని చెప్పారు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. ధరణి బాధితులకు అండగా వారం రోజుల పాటు భూ పరిరక్షణ ఉద్యమం.. మండల కేంద్రాల్లో భూ సమస్యలు ఎదుర్కొంటున్న ధరణి బాధితుల దగ్గర వినతి పత్రాలు స్వీకరణ అని వెల్లడించారు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్,.

రాష్ట్ర ,కేంద్ర ప్రభుత్వల దృష్టికి తీసుకెళ్తాము..ధరణి పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన  ఎస్సి ఎస్టీ ల అసైన్డ్ భూములను లాక్కున్నారని మండి పడ్డారు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, ధరణి పోర్టల్ వల్ల సెక్యూరిటీ ఎంత వరకు ఉందని తెలియదు..భూముల రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువ పెంచుతున్నామని ప్రభుత్వం చెప్తుందన్నారు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్.  ప్రాజెక్టులకు లక్షల ఎకరాల భూమి లాక్కుంది..అప్పుడు భూముల విలువ ఆధారంగా లెక్కలు కట్టలేదు..దీంతో భూమి కోల్పోయిన బాధితులు నష్టపోయారని వెల్లడించారు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్.  భూసేకరణ జరిగిన తరువాత ధరలు పెంచుతున్నామని ప్రజల నోట్లో మన్ను కొట్టాలని చూస్తున్నారు..ప్రభుత్వ ఖజానా ను పెంచుకోవడానికి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డ్యూటి కూడా పెంచాలని చూస్తున్నారని పేర్కొన్నారు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్.  కాంగ్రెస్ పార్టీ ధరణి బాధితులకు అండగా ఉంటుంది..అవసరమైతే ప్రధాని ,రాష్ట్రపతి ని కలుస్తామన్నారు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: