మేం గెలిస్తే ఇద్దరు సీఎంలు.. వామ్మో ఓవైసీ?

praveen
ఎన్నికలు వచ్చాయి అంటే రాజకీయ నాయకులు ఇచ్చే హామీలకు అడ్డూ అదుపు ఉండదు. ఆ తర్వాత ఎలా నెరవేరుస్తాం అన్న విషయం మర్చిపోయి  ప్రజలనూ హామీలతో  నమ్మిస్తే సరిపోతుంది అనుకుంటూ ఎన్నో హామీలు ఇస్తూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు ఎన్నికల సమయంలో రాజకీయ నాయకుల ఇచ్చే హామీలు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. శ్రీకాంత్ హీరోగా నటించిన ఆపరేషన్ దుర్యోధన సినిమా లో వైజాగ్ లో ఉన్న సముద్రాన్ని హైదరాబాద్ తీసుకు వస్తాను అంటూ  హామీ ఇచ్చినట్టుగానే ఎన్నికల సమయంలో రాజకీయ నాయకుల చిత్రవిచిత్రమైన హామీలతో ఆశ్చర్య పరుస్తూ ఉంటారు.

 ఇక ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో ఒక్కసారిగా రాజకీయ వేడి రాజుకుంది. ఇక అన్ని పార్టీలు ప్రజలను ఆకర్షించి తమ వైపు తిప్పుకోవడమే నిర్లక్ష్యంగా ఎన్నో వ్యూహాలతో బరిలోకి దిగుతున్నాయి. ఓ వైపు అన్ని సర్వేలు మళ్లీ బీజేపీ గెలుస్తుంది అని చెబుతున్నాయి. మరోవైపు నేనే సీఎం అవుతాను అంటూ సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు  అఖిలేష్ యాదవ్ చెప్పుకుంటున్నారు. ఈసారి ఎమ్మెల్యేగా బరిలోకి దిగబోతున్నారు అఖిలేష్ యాదవ్. ఇంకోవైపు అటు ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ సైతం  తమ పార్టీ తరఫున అభ్యర్థులను ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బరిలోకి దింపేందుకు సిద్దమవుతున్నారు.

 ఈ క్రమంలోనే ఇటీవలే ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలు మాత్రం హాట్ టాపిక్ గా మారిపోయాయ్. ఇటీవలే కొత్త కూటమి ప్రకటించారు ఆయన. జన అధికార్ పార్టీ, బిఏఎంసిఈఎఫ్ లతో కలిసి భాగి దారి పరివర్తన్ మోర్చా ఏర్పాటు చేసినట్లు ఇటీవలే ప్రకటించారు అసదుద్దీన్ ఓవైసీ. ఉత్తర ప్రదేశ్ ఎన్నికలలో తమనూ కూటమి గెలిపిస్తే ఐదు సంవత్సరాల కాలంలో ఓబీసీ నుంచి ఒకరు దళితుల నుండి ఒకరు ముఖ్యమంత్రి గా ఉంటారు హామీ ఇచ్చారు.  ముగ్గులు ఉప ముఖ్యమంత్రులు కూడా ఉంటారని హామీ ఇచ్చారు అసదుద్దీన్ ఓవైసీ. ఇక ఈ ముగ్గురు ఉపముఖ్యమంత్రి లలో ఒకరు ముస్లిం వర్గానికి చెందిన వారు ఉంటారని చెప్పుకొచ్చాడు. ఇక ఈ కూటమికి జన్ అధికార్ పార్టీ అధ్యక్షుడు బాబు సింగ్ నేతృత్వం వహిస్తారు అంటూ అసదుద్దీన్ ఓవైసీ ప్రకటన చేయడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

Oyc

సంబంధిత వార్తలు: