అయ్యబాబోయ్.. ఏపీ ఎక్స్ ప్రెస్ లో పొగలు?

praveen
సాధారణంగా రైలు ప్రయాణాలు ఎంతో సేఫ్టీ అని భావిస్తూ వుంటారు చాలామంది. కానీ కొన్నిసార్లు రైలు ప్రమాదాలు జరగడం చూసి అందరూ భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా రైలు ప్రమాదాలు జరిగినప్పుడు ఇక ఆ రైల్ లో ఉన్న ప్రయాణికులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని హాహాకారాలు చేస్తూ ఉంటారు. ఇకపోతే ఇటీవల కాలంలో రైలు ప్రమాద ఘటనలో తరచూ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. సాంకేతిక లోపం సమస్య కారణంగా ఎన్నో రైలు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.ఇటీవలే విశాఖపట్నం నుంచి ఢిల్లీకి వెళ్లే ఏపీ ఎక్స్ ప్రెస్ లో అగ్ని ప్రమాదం సంభవించడంతో కలకలం రేపింది.

 ఎప్పటిలాగానే రైలు వేగంగా వెళుతుంది. అంతా సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో అనుకోని విధంగా రైలు బోగీలో  పొగతో కూడిన మంటలు చెలరేగాయి. తెల్లవారు జామున ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. రైలులోని ఏస్6 బోగీలో ఇలా ఒక్కసారిగా పొగలు రావడంతో ఇక ఆ తర్వాత మంటలు చెలరేగడంతో ప్రయాణికులు అందరూ కూడా భయం తో ఊగిపోయారు. దీంతో కాపాడండి అంటూ హాహాకారాలు చేశారు ప్రయాణికులు. ఇక వెంటనే గమనించిన లోకో పైలెట్ అప్రమత్తమయ్యారు. వరంగల్ జిల్లా నెక్కొండ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు నిలిపివేశారూ. లోకో పైలట్ వెంటనే రైల్వే అధికారులకు సమాచారం అందించాడు.

 అయితే అప్పటికే మంటలు చెలరేగి పోవడంతో ఇక ప్రయాణికులు అందరూ కూడా ఎంతగానో భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా రైలు ఆగడంతో తమ లగేజ్ ను తీసుకుని వెంటనే కిందికి దిగి పోయారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న టెక్నికల్ సిబ్బంది పరిస్థితిని సమీక్షించారు. అయితే ట్రైన్ బ్రేకులు జామ్ కావడం కారణంగానే ఇలా పొగ వచ్చి చిన్నపాటి మంటలు చెలరేగి ఉంటాయి అని అటు టెక్నికల్ సిబ్బంది నిర్ధారించారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంటూ అధికారులు ప్రయాణికులకు ధైర్యం చెప్పారు. ఒక సమస్య పరిష్కారం అయిన వెంటనే ఏపీ ఎక్స్ప్రెస్ తిరిగి మళ్లీ బయలుదేరింది. అయితే ఈ ఘటనతో ప్రయాణికులు సుమారు గంటపాటు నెక్కొండ రైల్వే స్టేషన్ లోనే పడిగాపులు కాయాల్సినా పరిస్థితులు ఏర్పడ్డాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: