ఇక నుంచి రెండు హెలికాప్టర్లు.. మోదీ సర్కార్ నిర్ణయం?

praveen
ఇటీవలే తమిళనాడు లోని నీలగిరి హిల్స్ వద్ద 14 మందితో వెళ్లిన ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటన సంచలనంగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఇక 14 మందితో బయలుదేరిన ఆర్మీ హెలికాప్టర్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఒక్కసారిగా తమిళనాడు లోని నీలగిరి హిల్స్ లో కుప్పకూలిపోయింది. ఈ క్రమంలోనే ఇక ఈ  హెలికాప్టర్ లో ప్రయాణిస్తున్న 14మంది ఆర్మీ అధికారులు దుర్మరణం పాలయ్యారు. ఇక ఇందులో ప్రత్యేకంగా త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ కూడా ఉండటం అందరికీ మరింత దిగ్భ్రాంతికి గురి చేసింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

 ఇక ఈ ఘటన తర్వాత వివిఐపిల భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ప్రమాదాలు జరిగినప్పుడు తక్కువ ప్రాణనష్టం జరిగేలా చేయడం ఎలా అన్న దానిపై చర్చలు కూడా జరిపింది. ఇదిలా ఉంటే ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పంజాబ్ పర్యటనకు వెళ్లిన సమయంలో దాదాపు 150 మంది రైతులు ప్రధాని నరేంద్ర మోడీ కాన్వాయ్ ని అడ్డుకోవడం సంచలనంగా మారిపోయింది. చాలా సేపటి వరకు ప్రధాన మంత్రి కాన్వాయ్ని అడ్డుకోవడంతో ఇక తన పర్యటనను రద్దు చేసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఎయిర్పోర్టుకు చేరుకున్న తర్వాత ప్రాణాపాయం నుంచి బయట పడ్డాను అనే విధంగా మోదీ వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ గా మారిపోయింది.

 ఇలా ఈ రెండు ఘటనలు జరిగిన నేపథ్యంలో వివి ఐ పి  లను పంపెట్టు హెలికాప్టర్ల విషయంలో ఇటీవలే భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటి నుంచి వివిఐపిలు ఎక్కడికైనా పర్యటనకు బయలుదేరిన సమయంలో ఒకటి కాకుండా రెండు హెలికాప్టర్లు  తీసుకు వెళ్లేందుకు కొత్త రూల్ అమలులోకి తీసుకు రావాలనీ భారత ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా ఎక్కడైనా హెలికాప్టర్ ప్రమాదాలు జరిగినప్పటికీ ప్రాణ నష్టాన్ని నివారించే అవకాశం ఉంటుంది అని అభిప్రాయం వ్యక్తం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇదిమంచి నిర్ణయం అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: