ఇరాక్ లో సంచలనం.. మహిళలు కిక్ బాక్సింగ్?

praveen
ఇటీవల ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబాన్లు అధిపత్యం చేపట్టి పాలన సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇస్లామిక్ చట్టాలు అమలులోకి తీసుకు వస్తున్నారు అన్న విషయం తెలిసిందే.  ఇస్లామిక్ చట్టాల ప్రకారం మహిళలు ఎవరు కూడా చదువుకోవడానికి.. ఉద్యోగం చేయడానికి వీలు లేదని కేవలం ఇంటి పట్టునే ఉండాలి అంటూ ఆంక్షలు విధిస్తున్నారు తాలిబన్ లు. కేవలం ఆఫ్ఘనిస్థాన్లో  మాత్రమే కాదు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇస్లామిక్ దేశాలు అన్నింటిలో కూడా ఇలాంటి రూల్స్ అమలులో ఉన్నాయి అన్న విషయం తెలిసిందే.  మహిళలకు కనీస స్వేచ్ఛ లేకుండా కేవలం బానిస బ్రతుకులు బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

 మొన్నటి వరకూ సౌదీ అరేబియా లో కూడా ఇలాంటి కఠిన ఆంక్షలు కొనసాగాయ్. కానీ ఇటీవలి కాలంలో చట్టాల్లో మార్పులు తీసుకు వస్తూ మహిళలకు స్వేచ్ఛ కల్పిస్తూ సౌదీ అరేబియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంటూ ముందుకు సాగుతోంది. అయితే ఇస్లామిక్ దేశాల్లో ఒకటైన  ఇరాక్ లో కూడా ఇలాంటి తరహా ఆంక్షలు అమలులో ఉన్నాయి . కానీ గత కొంత కాలం నుంచి ఇస్లామిక్ చట్టాల్లో మార్పులు తీసుకొస్తుంది.  మహిళలకు స్వేచ్ఛ కల్పిస్తుంది అన్ని రంగాల్లో రాణించడానికి అవకాశం కనిపిస్తోంది.

 ఈ క్రమంలోనే ఇటీవల ఇరాక్ మహిళలు మహిళా సాధికారత సాధించే దిశగా వేగంగా అడుగులు వేస్తున్న విషయం అర్థమవుతుంది. మహిళల పట్ల కఠిన ఆంక్షలు కొనసాగే ఇస్లామిక్ దేశంలో ఏకంగా మహిళలు భారీ మొత్తంలో మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకుంటున్నారట. ఇటీవలే ఏకంగా కిక్ బాక్సింగ్ లో ఇరాక్కు చెందిన ఒక మహిళ పేరు నమోదు చేసుకోవడం హాట్ టాపిక్ గా మారిపోయింది.   ఆఫ్ఘనిస్తాన్ లో లాగానే అమెరికా సైన్యం ఇరాక్ ను వదిలి పెడితే మళ్లీ ఉగ్రవాదులు తమ ఆధిపత్యాన్ని సాధించుకోవడానికి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఇక తమకు తాము ఆత్మరక్షణ కల్పించుకోవడానికి ఇరాక్ మహిళలు ఇలా మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: