హైదరాబాద్ : బండికి లేనిది..రేవంత్ కు ఉన్నది ఏమిటో తెలుసా ?

Vijaya


తెలంగాణాలో ఇద్దరు కీలక నేతల మధ్య పోలిక మొదలైంది. బీజేపీ చీఫ్ బండి సంజయ్, పీసీసీ అద్యక్షుడు రేవంత్ రెడ్డి మధ్య తేడా స్పష్టంగా కనబడుతోంది. ఇక్కడే  బండికి లేనిది, రేవంత్ కు ఉన్నది ఇదే అనే తేడా స్పష్టమవుతోంది. ఇంతకీ బండికి లేనిది, రేవంతుకున్నది ఏమిటంటే అసమ్మతి. అవును బండి మీద పార్టీ నేతల్లో ఎక్కడా అసమ్మతి అనేది లేదు. బండి ఒక ప్రోగ్రామ్ పెట్టారంటే కాదనే వాళ్ళు, వద్దనే వాళ్ళు లేరు. పార్టీ కార్యక్రమాల విషయంలో బండిని వెనక్కు లాగే నేతలు ఎవరు లేరు.



అదే రేవంత్ విషయానికి వస్తే అడుగడుగునా అడ్డంకులే. రేవంత్ ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే అంతే సంగతులు. రేవంత్ సీనియర్లను సంప్రదించకుండా అన్నీ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారంటు నానా గోల చేస్తారు. సీనియర్లు అలుగుతారు. అధిష్టానికి ఫిర్యాదులు చేస్తు లేఖలు రాస్తారు. రేవంత్ ఒకడుగు ముందుకేయాలంటే సీనియర్లు పదడుగులు వెనక్కు లాగుతారు. ఏ కార్యక్రమాన్ని సాంతం జరగనివ్వరు. ప్రతి విషయంలోను రేవంత్ ను అటు ఇటు వాయించేస్తుంటారు.



ఇపుడు బండి విషయం తీసుకుంటే పోలీసులు అరెస్టు చేశారు. కరీంనగర్ కోర్టులో పెట్టి రిమాండ్ కు పంపేశారు. ఎప్పుడైతే బండిని పోలీసులు అరెస్టు చేశారో వెంటనే రాష్ట్రవ్యాప్తంగా కమలంపార్టీ నేతలు ధర్నాలు, ఆందోళనలు, నిరసనలంటు నానా గోల చేశారు. ఇదే మూడు రోజుల ముందు రేవంత్ ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. వెంటనే రేవంత్ చేసింది తప్పంటు వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అండ్ కో రివర్సు మొదలుపెట్టారు. ఇపుడు బండి చేసింది, అప్పుడు రేవంత్ చేసింది కేసీయార్ కు వ్యతిరేకంగానే. అయినా బండి కార్యక్రమాలను బీజేపీ నూరుశాతం ఓన్ చేసుకున్నది.



రేవంత్ విషయానికి వచ్చేసరికి పార్టీలే అధ్యక్షుడిని తప్పుపట్టారు. రేవంత్ చేతికి పగ్గాలు వచ్చేసమయానికి పార్టీ స్తబ్దుగా ఉండేది. నేతల్లో కానీ కార్యకర్తల్లో కానీ పెద్దగా హుషారుండేది కాదు. ఎప్పుడైతే రేవంత్ అద్యక్షుడయ్యారో వెంటనే నేతలు, కార్యకర్తల్లో కొత్త జోష్ మొదలైంది. పార్టీకి ఒక ఊపు తీసుకొచ్చారు. నిజానికి బండితో పోల్చుకుంటే రేవంత్ కే మంచి వాగ్దాటి ఉంది. ప్రత్యర్ధులపైన పంచ్ లు వేయటంలోను, చెప్పాలనుకున్నది స్పష్టంగా చెప్పటంలోను, సెటైర్లు వేయటంలోనే రేవంత్ పెట్టింది పేరు. అయినా బండికొచ్చిన మైలేజీ రేవంత్ కు ఎందుకు రావటంలేదో అర్ధమైయ్యిందా ?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: