జగన్‌పై వర్మ డెలిటెడ్‌ ట్వీట్‌.. భలే వైరల్‌ అవుతోందిగా..?

Chakravarthi Kalyan
రామ్‌గోపాల్‌ వర్మ.. నేనింతే.. నేనిలాగే ఉంటా.. అని చెప్పడమే కాదు. చేసి చూపించే వ్యక్తి రామ్‌గోపాల్ వర్మ.. ఒకప్పుడు బాలీవుడ్‌ ను ఊపేసిన సినిమాలు చేసిన ఆ రామ్‌గోపాల్ వర్మ..ఇప్పుడు తెలుగులో బీ గ్రేడ్ సినిమాలు చేస్తూ తన స్థాయి కోల్పోతున్నాడని ఆయన అభిమానులు కూడా చాలా మంది బాధపడుతుంటారు. అయితే. వర్మ ఫిలాసఫీలో ఓ ఆకర్షణ ఉంటుంది.. ఓ తెగింపు ఉంటుంది. నాకు నచ్చినట్టు నేను చేస్తా అని చెప్పి చేయడం ఈ సమాజంలో అంత సులభం కాదు.

కానీ.. రామ్‌ గోపాల్ వర్మ మాత్రం అది ఆచరించి చూపుతాడు. దాన్నే ఆయన ఫ్యాన్స్ ముద్దుగా రామూయిజం అంటారు.. ఎలాంటి కాంట్రావర్శీ పని చేసినా.. దానికి ఆయన వివరణ ఇచ్చుకునే తీరు మాత్రం కన్విన్సింగ్‌గా ఉంటుంది. అందుకే ఆర్జీవీ అంటే.. ఇండస్ట్రీలో అదే క్రేజ్.. సినిమాల విషయంలోనే కాదు. పర్సనల్‌ గా కూడా రామూ అంతే.. ఎవరికీ భయపడడు.. మొహమాటాలు అస్సలు ఉండవు.. మైండ్‌లో ఏముందో అది చెప్పేస్తారు.. ఇలా రామూ గురించి కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి.

అయితే.. తాజాగా ఆయన ఏపీ సీఎం జగన్‌ గురించి రెండు పోస్టులు పెట్టి డెలిట్‌ చేసినట్టు ఆ పోస్టులు వైరల్ అవుతున్నాయి. అవి నిజంగా ఆయన పెట్టినవా లేదా.. అనేది చెప్పలేం. కానీ.. అవి వైరల్ అవుతున్నాయి. వైసీపీలో తనకు నచ్చే ఒకే ఒక్క నాయకుడు వైఎస్‌ జగన్‌ అన్న ఆర్జీవీ.. ఆయన చుట్టూ ఉన్న వాళ్ల కొందరు నేతలు జగన్ను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆ పోస్టులో తెలిపాడు. కొందరు నేతలు తమ ప్రయోజనాల కోసం సీఎం జగన్‌ను ప్రభావితం చేస్తున్నారన్న వర్మ..  హే..జగన్.. అలాంటి వారి పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని సున్నితంగా హెచ్చరించారు.

అలాగే మా అమ్మ, చెల్లి కూడా మీకే ఓటేశారు..కానీ ఇప్పుడు మీ  నేతల ప్రవర్తన చూసి బాధపడుతున్నారని రెండో పోస్టులో రాసినట్టుంది. సాధారణంగా రాము తత్వానికి ఈ పోస్టు పెద్దగా ఆశ్చర్యపరచదు. మరి దీన్ని ఆ తర్వాత ఎందుకు డెలీట్ చేశాడన్నది అంతు బట్టకుండా ఉంది. నేరుగా జగన్‌తో ఎందుకులే అనుకున్నారా..? ఇప్పటికే ఏపీ సర్కారుపై చాలా చేశాం.. ఇక చాల్లే అనుకున్నాడా.. ఏమో.. ఆ విషయం ఆర్జీవీకే తెలియాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి:

RGV

సంబంధిత వార్తలు: