ఒమిక్రాన్ కేసులు పెరిగితే.. బాధ్యత బండి సంజయ్ దే ?

Veldandi Saikiran
కరీంనగర్ జిల్లా:  మంత్రి గంగుల కమలాకర్‌ షాకింగ్‌ కామెంట్స్ చేశారు.  బండి సంజయ్ ది జాగరణ దీక్ష డ్రామా దీక్ష అని...  కోవిడ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంపై వత్తిడి చేస్తోందని గుర్తు చేశారు.  కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడే కోవిడ్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నాడని... రేపటి నుండి కరీంనగర్ లో ఒమిక్రాన్‌ కేసులు పెరిగితే బండి సంజయ్ బాధ్యత వహించాలని చురకలు అంటించారు.  బండి సంజయ్ దీక్ష చేయలసింది మోడీ ఇంటి ముందు కోటి ఉద్యోగాలపై దీక్ష చెయాలని డిమాండ్‌ చేశారు మంత్రి గంగుల కమలాకర్‌.  జాగరణ దీక్షకు ఒక్క పర్మిషన్ అయినా ఉన్నదా అని ప్రశ్నించారు. ప్రజల్లో సానుభూతి కోసమే జాగరణ దీక్ష చేసాడని నిప్పులు చెరిగారు  మంత్రి గంగుల కమలాకర్‌.  బండి సంజయ్ కు జీవో నెంబర్ 317 పై ఏమి అవగాహన ఉందని... జీవో విషయంలో  ప్రభుత్వానికి ఏమన్నా లేక రాసాడా అని ప్రశ్నించారు  మంత్రి గంగుల కమలాకర్‌.  ఉపాధ్యాయ సంఘాలతోనే   మంతనాలు జరిపారని చెప్పారు.   

కరీంనగర్ ఎంపీ కోవిడ్ ఉల్లంఘన కు బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు  మంత్రి గంగుల కమలాకర్‌. బండి సంజయ్ చుట్టూ వందల మంది మాస్కులు లేకుండా ఎందుకు పాల్గొన్నారని నిప్పులు చెరిగారు  మంత్రి గంగుల కమలాకర్‌. జాగరణ దీక్షను అడ్డుకున్న పోలీసులకు అభినందనలు అన్నారు  మంత్రి గంగుల కమలాకర్‌. మాకు రాజకీయం ముఖ్యం కాదు కరీంనగర్ జిల్లా ప్రజల ఆరోగ్యాలే ముఖ్యమన్నారు.  కాగా... కరీంనగర్ జిల్లా ఎంపీ కార్యాలయంలో జాగరణ దీక్షను నిన్న రాత్రి భగ్నం చేశారు పోలీసులు. ప్రస్తుతం మనకొండూర్ పోలీస్ స్ట్రేషన్ లో జాగరణ దీక్ష చేస్తున్నారు బండి సంజయ్.  బండి సంజయ్ ను అరెస్ట్ చేస్తున్న తరుణంలో పోలీసులకు బిజెపి నాయకులకు మధ్య వాగ్వాదం తోపులాట చోటు చేసుకుంది అయినా.. అతన్ని అరెస్ట్‌ చేశారు పోలీసులు. ఈ సంఘటనలో... పలువురి బిజెపి నాయకులకు,  కార్యకర్తలకు గాయాలు  అయ్యాయి.  పలువురికి కాళ్లు, చేతులు విరిగాయి వారందరిని ఆస్పత్రికి తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: