హ్యాపీ సండే : అతి చేయొద్దు నాయ‌కా! గ‌తి చెడుద్ది!



--------------------------------------------
ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి మాజీ సభ్యుడు. వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి కి కుటుంబ సభ్యుడని కూడా అందరూ అంటుంటారు. ప్రస్తుతం రాజ్యసభలో వై.ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. మీడియా సమాజం దృష్టిలో ఆయన  ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గొంతుక. ఇంత చెప్పినా ఆయన ఎవరో గుర్తుకు రాలేదా ? లోనికి రండి
రాజకీయలలో అనుచరులే కానీ, సహచరులుండరనేది ప్రతీతి. ఆంధ్ర ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న నెల్లూరీయుడు   వేణుంబాక విజయ సాయి రెడ్డి ముఖ్యమంత్రికి సహచరుడు. అత్యంత సన్నిహితుడుగా పేరుగాంచారు. పార్టీలోనూ, అధికారం లోనూ ఇతని ప్రభావం అంతా ఇంతా కాదు. అన్నింటా అతనే  ఏ-2 అని కూడా ప్రచారం ఉంది. ఇతని దూకుడుకు వై.ఎస్. ఆర్ కాంగ్రెస్ కు చెందిన నేతలంతా  కిక్కురుమనకుండా ఉంటారంటే అతిశయోక్తి  లేదు. ఇతని వ్యవహార శైలి నచ్చని  ఆ పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు నిత్యం సొంత పార్టీ పైనా విమర్శలు సంధిస్తుంటారు. దేశ రాజధానిలో మీడియా మిత్రులను వెంటబెట్టుకుని నిత్యం వార్తల్లో ఉంటారా అసమ్మతి ఎం.పి.  ఆ విషయం కాస్త పక్కన పెక్కన పెట్టి అసలు విషయం లోకి వస్తే..
ఈ వారం పార్లమెంట్ సమావేశాల్లో తెలుగు రాష్ట్రాల సభ్యులు తమ వాణిని వినిపించారు. తెలంగాణ సభ్యులు ధాన్యం కొనుగోలు విషయంలో పెద్ద రాద్ధాంతమే చేశారు. ఆంధ్ర ప్రదేశ్ సభ్యులు కూడా తమ వాణిని వినిపించారు. దాదాపు ప్రతి సభ్యుడు సభలో నేనున్నాననిపించారు. ఎప్పుడు రాజ్యసభ సమావేశాలు జరిగినా అంతా తానేే అయి వ్యవహరించే vijayasai REDDY' target='_blank' title='విజయసాయి రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">విజయసాయి రెడ్డి మాత్రం  ఈ దఫా పార్లమెంట్ సమావేశాల్లో పాల్గోన్నాననిపించారు.  గతంలో పోలిస్తే ఈ దఫా చర్చల్లో ఎక్కువగా మాట్లాడలేదని ఆ పార్టీ నేతలే గుసగుస లాడుకుంటున్నారు. అయితే vijayasai REDDY' target='_blank' title='విజయసాయి రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">విజయసాయి రెడ్డి సభా సమావేశాలప్పుడు ఏమి చేశారు ? అనే ప్రశ్న పాత్రికేయ జనానికి వచ్చింది. ఇంతకీ ఆయన ఎం చేశారో తెలుసా ?  సభా సమావేశాలను పక్కన పెట్టారు. కేంద్ర హోం మంత్రితో సమావేశమయ్యారు. మరుసటి రోజే ప్రధాన మంత్రి దామోదర్ దాస్ నరేంద్ర మోడీతో సమావేశ మయ్యారు. ఆ సమావేశాల్లో రాష్ట్ర ప్రజల సమస్యలను చర్చించా ? ఈ ప్రశ్న మాత్రం అడగొద్దు...ష్ ష్...,,గప్ చిప్


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: