ఒమిక్రాన్ విజేతకు మళ్లీ కరోనా..!

NAGARJUNA NAKKA
దేశంలో తొలిసారి ఒమిక్రాన్ వేరియంట్ సోకిన ఇద్దరిలో ఒకరైన బెంగళూరు వైద్యుడికి మళ్లీ కరోనా పాజిటివ్ రావడం కలకలం రేపుతోంది. ప్రస్తుతం ఆయన ఐసోలేషన్ లో ఉన్నాడనీ.. ఎలాంటి లక్షణాలు లేవని అధికారులు తెలిపారు. అయితే ఒమిక్రాన్ ను జయించాడనుకున్న లోపే మళ్లీ ఆయనకు కరోనా పాజిటివ్ రావడంపై వైద్యాధికారుల్లో గుబులు రేపుతోంది. అయితే ఇప్పటి వరకు దేశంలో 23ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి.
మరోవైపు విద్యాలయాల్లో కరోనా కేసులు బయటపడుతూనే ఉన్నాయి. కర్ణాటకలోని చిక్ మగళూరు జవహర్ నవోదయ పాఠశాలలోమొత్తం 101 మందికి వైరస్ సోకడం కలకలం రేపుతోంది. ఇందులో 90మంది విద్యార్థులు ఉండగా.. 11మంది సిబ్బంది ఉన్నారు. అయితే వీరిలో ఎవరికీ లక్షణాలు లేవని అధికారులు తెలిపారు. వారందరి శాంపిల్స్ ను జినోమ్ సీక్వెన్సింగ్ కు పంపారు.
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పై అమెరికాకు చెందిన ప్రముఖ వైద్య నిపుణుడు ఆంటోనీ ఫౌచీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రారంభ నివేదికలను బట్టి ఇప్పటి వరకు ఒమిక్రాన్ వల్ల తీవ్ర లక్షణాలు బయటపడలేదన్నారు. అలాగే డెల్టావేరియంట్ తో పోలస్తే ఇది స్వల్ప లక్షణాలనే కలిగి ఉందన్నారు. కానీ ఇప్పుడిప్పుడే వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్ పై అప్పుడే ఒక నిర్ణయానికి రావడం సరికాదని ఫౌచీ అభిప్రాయపడ్డారు.
ఇక కరోనా కొత్త వేరియంట్ బయటపడిన దక్షిణాఫ్రికాలో కేసులు బయటపడుతూనే ఉన్నాయి. అయితే తీవ్ర వ్యాధి లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరికలు మాత్రం తక్కువగానే ఉన్నాయని ఆ దేశ అధ్యక్షడు సిరిల్ రమసోఫా తెలిపారు. ఈ వేరియంట్ కారణంగా ఆందోళనకర పరిస్థితులు తలెత్తే ప్రమాదం కనిపించడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే దక్షిణాఫ్రికా నుంచి 30కి పైగా
దేశాలకు ఒమిక్రాన్ వేరియంట్ వ్యాపించింది.
మొత్తానికి ఒమిక్రాన్ వైరస్ ప్రపంచ దేశాలను గడగడ లాడిస్తోంది. అయితే కరోనా వైరస్ తో పోలిస్తే ఒమిక్రాన్ అంత ప్రమాదకరం కాదని కొందరు వైద్యనిపుణులు చెబుతున్నారు. అయితే ఆ వైరస్ ఇన్ ఫెక్షన్ కు దారితీస్తుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల ప్రకటించింది.







మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: